AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..! ఏకంగా మూడు ఓటీటీల్లోకి కల్కి 2898 AD

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, విజువల్స్ హాలీవుడ్ సినిమాలను మించిపోయేలా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రైట్స్‌లో కొన్ని విడుదలకు ముందే అమ్ముడు పోవడంతో నిర్మాతకు భారీ మొత్తంలో వాపస్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కల్కి సినిమా కు సంబందించిన ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ థ్రిల్ అవుతున్నారు. 

Kalki 2898 AD: ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే..! ఏకంగా మూడు ఓటీటీల్లోకి కల్కి 2898 AD
Kalki
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2024 | 8:22 PM

ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియెట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, విజువల్స్ హాలీవుడ్ సినిమాలను మించిపోయేలా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రైట్స్‌లో కొన్ని విడుదలకు ముందే అమ్ముడు పోవడంతో నిర్మాతకు భారీ మొత్తంలో వాపస్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కల్కి సినిమా కు సంబందించిన ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ థ్రిల్ అవుతున్నారు.

‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఒకేసారి మూడు ఓటీటీలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది, ఆ తర్వాత జీ5 కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను కొనుగోలు చేసింది. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ సినిమా ఏకంగా మూడు OTTలకు, అది కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. మూడు OTT లను కలిపి భారీ ధరకు కల్కి సినిమా అమ్ముడుపోయిందని తెలుస్తోంది. కల్కి 2898 AD’ మూడు ప్రధాన OTTలు, నెట్‌ఫ్లిక్స్, Zee5 మరియు అమెజాన్ ప్రైమ్‌లకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నాయి.

‘కల్కి’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్ అలాగే కొన్ని విదేశీ భాషలలో ప్రదర్శించబడుతుంది. ‘కల్కి’ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ,జీ5 లలో ప్రసారం చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ద్వారా ఇంటర్నేషనల్ ఆడియన్స్ , జీ5 ద్వారా ఇండియన్ ప్రేక్షకులను ఎఫెక్టివ్‌గా రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపు 375 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ‘కల్కి’ చిత్రం ‘ఆర్ఆర్ఆర్ ‘ రికార్డును బద్దలు కొట్టింది. ఈ చిత్రం జపనీస్, ఫ్రెంచ్ లతో పాటు కొన్ని ఇతర భాషలలోకి డబ్ చేయనున్నారు.  అక్కడి ప్రేక్షకులు కూడా ప్రభాస్ చిత్రాన్ని చూసే అవకాశం ఉన్నందున, నెట్‌ఫ్లిక్స్ , ఇతర OTT లు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేశాయి. ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు పలువురు ముఖ్య నటులు కూడా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కథను కథను నాగ్ అశ్విన్, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్‌లు సంయుక్తంగా రచించారు. జూన్ 27న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది కల్కి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.