దివంగత హీరో కృష్మం రాజు సంస్కరణ సభను ఆయన సొంత గ్రామం మొగల్తూరులో సంస్కరణ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తన పెదనాన్న కోసం దాదాపు పన్నెండేళ్ల తర్వాత స్వగ్రామానికి ప్రభాస్ తన కుటుంబసభ్యులతో కలిసి రావడంతో పోలీసు బందోబస్తుతో ఏర్పాట్లు చేశారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నాడు. రెబల్ స్టార్.. డార్లింగ్.. అంటూ నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో వారిని ఉద్దేశించి మాట్లాడారు. వారికి హాయ్ చెబుతూ.. ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చారు. అనంతరం.. ప్రభాస్ మాట్లాడుతూ.. “అందరు ఎలా ఉన్నారు?.. లవ్ యూ డార్లింగ్.. లవ్ యూ ఆల్ టు ది కోర్. అందరూ భోజనం చేయండి” అంటూ చెప్పుకొచ్చారు.
సెప్టెంబర్ 11న సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్మం రాజు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన… హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్ హౌస్‌లో నిర్వహించగా.. దశదిన కర్మ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నిర్వహించారు. ఇక కృష్ణంరాజు సంస్మరణ సభకు ముందుగా 70 వేల మంది అభిమానులు వస్తారని అంచనా వేయగా.. దాదాపు లక్ష మందికి పైగా ఫ్యాన్స్ రావడంతో.. భారీ కేడ్లతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మరోవైపు ప్రభాస్ అభిమానులు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 2010లో తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో సంతాప కార్యక్రమాల కోసం ప్రభాస్ మొగల్తూరులో వారం రోజుల పాటు ఉన్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తన పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం వచ్చారు.
Oh God ! Flying kisses ?
Appetite filler clip ❤️❤️
.#Prabhas isnt he looking hot & cute both at same time ? pic.twitter.com/7NnyOCszcJ— Raju Garu Prabhas ? (@pubzudarlingye) September 29, 2022
#Prabhas? #KrishnamRajuLivesOn #Prabhas pic.twitter.com/mUHJjnxobe
— Hello Mawa (@HelloMawa123) September 29, 2022
?? Thread ??#Prabhas at #Mogalthuru ?
Early morning ah crowd yentra ?#PrabhasatMogalthuru pic.twitter.com/JoIIVVSgSl
— PRABHAS Fans Celebrations (@PrabhasEuphoria) September 29, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.