Salaar: దుమ్మురేపుతున్న సలార్..అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్‌తో నయా రికార్డ్

|

Aug 28, 2023 | 9:19 AM

బాహుబలి సినిమాతర్వాత వచ్చిన సాహో సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్స్ లో మాత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా సలార్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా పేక్షకుల ముందుకు రానుంది.

Salaar: దుమ్మురేపుతున్న సలార్..అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్‌తో నయా రికార్డ్
Salaar
Follow us on

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. ఒక్క సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ బడా మూవీసే. బాహుబలి సినిమాతర్వాత వచ్చిన సాహో సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కలెక్షన్స్ లో మాత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా సలార్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా పేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే సలార్ మూవీ బుకింగ్స్ ఇప్పుడు అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాయి. సలార్ సినిమా యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ క్రియేట్ చేశాయని తెలుస్తోంది.

యూఎస్ 290 లొకేషన్స్ లో 848 షోలకు 11639 టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. రానున్న రోజులల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన నటిస్తుంది. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సలార్ సినిమా రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.