Raja Saab : ప్రభాస్ వచ్చేస్తున్నాడు.. మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు డార్లింగ్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రాజా సాబ్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

Raja Saab : ప్రభాస్ వచ్చేస్తున్నాడు.. మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ ముందుకు డార్లింగ్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడంటే..
Raja Saab

Updated on: Dec 27, 2025 | 12:16 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇదివరకే అమెరికాలో టికెట్ బుకింగ్స్ సైతం స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత ఇందులో వింటేజ్ ప్రభాస్ కనిపించనున్నారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మూవీని చూసేందుకు అభిమానులు వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈరోజు (డిసెంబర్ 27)న సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా ఫ్యాన్స్ రానున్నారు. గతంలో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఇదే గ్రౌండ్ లో 220 ఫీట్ల భారీ కటౌట్ ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇదెలా ఉంటే.. చాలా కాలంగా సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్.. ఇప్పుడు ఫ్యాన్స్ ముందుకు రానున్నారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

ఆదిపురుష్, కల్కి సినిమాల తర్వాత ఇప్పుడు అభిమానుల మధ్యకు రాబోతున్నారు ప్రభాస్. నిజానికి ప్రభాస్ మీడియాకు దూరంగా ఉంటారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరో ప్రీ రిలీజ్ వేడుకకు వస్తుండడంతో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..