Tollywood: ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇలా బొద్దుగా మారిపోయిందేంటి? ఫొటోస్ వైరల్

|

Dec 09, 2024 | 2:51 PM

ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. పెద్దగా సినిమాలు చేయలేకపోయినా తన అందం, అభినయంతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోందీ అందాల తార.

Tollywood: ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇలా బొద్దుగా మారిపోయిందేంటి? ఫొటోస్ వైరల్
Tollywood Actress
Follow us on

ఒకట్రెండు సినిమాల్లో నటించినా తెలుగు ప్రేక్షకుల మనసులో అలాగే మెదిలిపోయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. అందులో ఒకటి ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న ప్రభాస్ సినిమాలో. అయితే ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. ఫలితంగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం భర్త, పిల్లలే జీవితంగా గడిపేస్తోన్న ఈ బొద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర మూవీ హీరోయిన్ శ్వేత అగర్వాల్. ఇందులో ‘నమ్మిన నా మది మంత్రాలయమేరా’ అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలో తన అందం, ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టి పడేసింది శ్వేత. అయితే ఈ మూవీ ప్లాఫ్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కూడా మాయమైపోయింది. అయితే రాఘవేంద్ర సినిమా కంటే అల్లరి నరేష్ మొదటి సినిమా అల్లరిలోనూ ఓ హీరోయిన్ గా నటించింది శ్వేత. ఇందులో అప్పుగా ఆడియెన్స్ ను బాగా నవ్వించింది. అలాగే అల్లరి నరేష్, శర్వానంద్ హీరోలుగా నటించిన గమ్యం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక గమ్యం తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదీ అందాల తార.

2008లో ఇంగ్లిష్ లో తందూరి లవ్ అనే సినిమాలో కనిపించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపర్చింది. ఆ తర్వాత బాలీవుడ్ సీనియర్ దర్శకుడు మహేష్ భట్ తెరకెక్కించిన షాపిత్ అనే హార్రర్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది శ్వేత. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఎందుకో గానీ తన సినిమా కెరీర్ ను కొనసాగించలేకపోయింది.

Shweta Agarwal

కూతురితో శ్వేత అగర్వాల్..

కాగా 2020లో బాలీవుడ్ సింగర్, హోస్ట్ ఆదిత్య నారాయణను వివాహం చేసుకుంది శ్వేత అగర్వాల్. వీరిద్దరూ షాపిత్ సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత జీవితాన్ని కూడా పంచుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా ఉంది. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకి టైమ్ కేటాయించిన శ్వేత.. నెట్టింట మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన కూతురుకు సంబంధించిన ఫొటోలను తరచూ షేర్ చేసుకుంటుంది.

భర్తతో శ్వేత అగర్వాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.