
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ రెండు సినిమాలపైనే ఉన్నాయి. ఇప్పటికే టీజర్‌తో సలార్ సినిమా ఏ రెంజ్లో ఉంటుందో చెప్పేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ప్రాజెక్ట్ కె గ్లింప్స్‌తో మరో ప్రపంచాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పకనే చెప్పారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మొత్తానికి ఈ చిత్రాలతో మాస్ యాక్షన్ సినీ ప్రియులను మెప్పించనున్నారు ప్రభాస్. ఓవైపు ఈ చిత్రాల షూటింగ్స్ లలో పాల్గొంటూనే.. మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట డార్లింగ్. ఇప్పటికే దర్శకుడు హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేసేందుకు డార్లింగ్ ఓకే అన్నారని టాక్. ఇక ఇప్పుడు మరో సినిమాకు ఓకే చెప్పారట.
తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కొత్త సినిమాను మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించనున్నారట. ఇప్పటికే డార్లింగ్ కోసం పృథ్వీ ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడని.. ఆ స్టోరీని ప్రభాస్ కు చెప్పగా.. డార్లింగ్ సైతం ఓకే చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని.. అలాగే నటీనటులను సైతం ఫైనల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే వరుస యాక్షన్ సినిమాలతో వస్తోన్న ప్రభాస్.. సలార్ మూవీ తర్వాత డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత పృథ్వీరాజ్ దర్శకత్వంలో వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.