
బాహుబలి కోసం ఏకంగా ఐదేళ్లు పనిచేసిన డార్లింగ్ ప్రభాస్.. ఆ తరువాత స్పీడుగా సినిమాలు చేయాలనుకున్నా కుదరటం లేదు. సాహో కోసం మరో ఏడాదిన్నర సమయం పట్టింది. ఆ తరువాత రాధేశ్యామ్ అయినా త్వరగా వస్తుందేమో అనుకుంటే ఆ సినిమా కూడా వాయిదా పడుతూనే ఉంది. కరోనా దెబ్బకు ఆదిపురుష్, సలార్ సినిమాలు కూడా వెనక్కెళ్లి పోతున్నాయి.
ఇలా అన్ని సినిమాలు వాయిదా పడుతుండటంతో నెక్ట్స్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా డీలే అవుతున్నాయి. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేసేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ అంటూ ఎనౌన్స్ మెంట్ దగ్గర నుంచే సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.
అన్నీ సరిగా ఉంటే ఈ సినిమా జూలైలోనే స్టార్ట్ చేయాలన్నది యూనిట్ ప్లాన్. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. వరుస వాయిదాలతో అన్ని సినిమాలు డీలే అవుతున్నాయి. అందుకే నాగ్ అశ్విన్ కూడా తన సినిమాను నవంబర్‌లో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. 2021 నవంబర్‌లో ఈ సినిమా స్టార్ట్ అయితే రిలీజ్ అయ్యే సరికి 2023 వచ్చేస్తుందేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికతో రొమాన్స్ చేస్తున్నారు మన డార్లింగ్. ఇక ఈ సినిమాతో పాటు రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమా లు చేస్తున్నాడు ప్రభాస్. వీటిలో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :