Prabhas: రీరిలీజ్ రెడీ అవుతున్న ప్రభాస్ సూపర్ స్టైలిష్ మూవీ..

ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. హీరోల పుట్టిన రోజులకు.. అలాగే స్పెషల్ డేస్ సందర్భంగా సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతున్నాయి. అంతే కాదు భారీ కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ప్రభాస్ నటించిన బిల్లా , యోగి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Prabhas: రీరిలీజ్ రెడీ అవుతున్న ప్రభాస్ సూపర్ స్టైలిష్ మూవీ..
Prabhas

Updated on: Aug 30, 2023 | 7:13 AM

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల సందడి కనిపిస్తుంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. హీరోల పుట్టిన రోజులకు.. అలాగే స్పెషల్ డేస్ సందర్భంగా సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతున్నాయి. అంతే కాదు భారీ కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ప్రభాస్ నటించిన బిల్లా , యోగి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా మరో సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ కానుంది. దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అయిన సినిమా ఎదో తెలుసా..? ఆ సినిమా మరేదో కాదు మున్నా. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు ప్రభాస్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..