Adipurush : చెడు మీద మంచి సాధించిన విజయం అంటూ సాదాసీదా డెఫినిషన్‌తో మొదలుపెట్టినా… తాను తియ్యబోయే రామాయణం వేరే వుంటది అంటున్నారు డైరెక్టర్ ఓం రౌత్. తాజాగా ఆదిపురుష్ గురించి మిస్టర్ ఓం చెప్పిన రిమార్కబుల్ పాయింట్స్.. ముందునుంచీ ఆ సినిమాపై వున్న అంచనాల్ని రెట్టింపు చేస్తున్నాయి. మీ డార్లింగ్‌తో నా రామాయణం తీస్తున్నా అంటూ.. వన్ ఫైన్ మార్నింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్. వెంటనే గతంలో సెల్యులాయిడ్‌పై వచ్చిన రాముడి కథలన్నిటినీ ఒక్కసారిగా రీకాల్ చేసుకున్నారు సినీజనం. కానీ… అవన్నీ ఒక లెక్క, ప్రభాస్ రామాయణం ఒక్కటీ ఒక లెక్క అంటున్నారు. కెప్టెన్ ఓం.
ఇప్పటికే చాలామంది తమతమ సొంత ఇమాజినేషన్లతో డార్లింగ్‌కి రాముడి గెటప్పేసి కాన్సెప్ట్ ట్రయిలర్లు క్రియేట్ చేశారు. కానీ… ఆదిపురుష్ ఒరిజినల్ అది కాదు అంటున్నారు మిస్టర్ ఓం. ఇది చిల్ర్జన్ ఫ్రెండ్లీ రామాయణ్ అనీ, అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు. 20 ఏళ్ల కిందట జపాన్ వాళ్లు తీసిన ‘ది ప్రిన్స్ ఆఫ్ లైట్’ చూశాకే ఆదిపురుష్ ఐడియా వచ్చిందంటున్నారు. బయటవాళ్లే మన రామాయణాన్ని అంత అద్భుతంగా తీసినప్పుడు ఇక్కడ మనం చేస్తున్నదేంటి… కొత్త జెనరేషన్లకు పాత రామాయణాన్ని ఎలా పరిచయం చేయాలి… అంటూ తీవ్రంగా కసరత్తు చేశారట. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్‌ని రాముడుగా కాకుండా రాఘవుడుగా పిలుస్తారని, సీత క్యారెక్టర్‌ని జానకిగా చూస్తారని చెబుతున్నారు. లిటరల్‌గా చెప్పాలంటే ఆదిపురుష్ అంటే ది ఫస్ట్ మాన్. కానీ… తన కథలో ఆదిపురుష్ ది బెస్ట్ మ్యాన్ అంటున్నారు ఓం. మరి… నాటి పురుషోత్తముడి కథకు నేటి సామాజిక అంశాల్ని కూడా జోడిస్తారా అనేవి కొత్త డౌట్లు. అన్‌సంగ్ వారియర్ తానాజీని కొత్తగా చూపించి సక్సెట్ కొట్టిన అనుభవం వుంది ఓం రౌత్‌కు. ఇలాగే తనదైన మోడ్రన్ స్టోరీటెల్లింగ్ టెక్నిక్స్‌తో రామాయణానిక్కూడా న్యూ ఏజ్ కలర్స్ యాడ్ చేసే ఛాన్సుందట. సో.. ఆధునిక రామాయణంగా, ఒక ఆఫ్‌బీట్ మైథలాజికల్ మూవీగా రూపొందబోతోంది ఆదిపురుష్.
మరిన్ని ఇక్కడ చదవండి :