Prabhas: ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. జస్ట్ ఇలా చేసేయండి

మీకు సినిమాల్లో నటించాలని ఉందా? అందులోనూ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వార్త. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2 చిత్ర బృందం క్యాస్టింగ్ కాల్ ప్రకటించింది.

Prabhas: ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. జస్ట్ ఇలా చేసేయండి
Prabhas

Updated on: Aug 11, 2026 | 6:29 AM

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2 ఒకటి. గతంలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగేఎందరో స్టార్స్ క్యామియో రోల్స్ లో మెరిశారు. రెండేళ్ల క్రితం రిలీజైన కల్కి 2898 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింఇ. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ సైన్స్ ఫిక్షన్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సూపర్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ చిత్రంలో మీరు కూడా భాగం అవ్వాలని అనుకుంటున్నారా? ప్రభాస్ మూవీలో నటించాలని ఉందా? మరెందుకు ఆలస్యం.. మీ టాలెంట్‌ చూపించే వీడియోలను పంపండి. ఈ క్రేజీ ఛాన్స్ కొట్టేయండి అంటూ క్యాస్టింగ్ కాల్ ను అనౌన్స్ చేశారు.

ప్రభాస్ కల్కి సీక్వెల్ మూవీలో నటించాలనుకునే వారి కోసం క్యాస్టింగ్ కాల్ వచ్చేసింది. ఈ అరుదైన గోల్డెన్‌ ఛాన్స్‌ను మీ రెండు చేతులతో ఒడిసి పట్టుకోండి. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి ఎలాంటి షరతులు లేకుండా ఈ మూవీలో నటించే ఛాన్స్ ఇస్తామని కల్కి 2 మేకర్స్ ప్రకటించారు. ఇందు కోసం ఆసక్తిగల వారు తమ వివరాలను, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే మెయిల్ చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలోని టాలెంట్‌ బయటికి తీయండి… పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేయండి

ఇవి కూడా చదవండి

కల్కి టీమ్ క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్..

 

కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2’ సినిమాతో పాటు ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’ సినిమాలు ఉన్నాయి. వీటిలో మొదటగా ఫౌజీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరగనుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us