The Raja Saab Pre Release Event: ‘అందుకే పెళ్లి చేసుకోలేదు’.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ప్రస్తావనకు వస్తూనే ఉంది. డార్లింగ్ పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పెళ్లి గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

The Raja Saab Pre Release Event: అందుకే పెళ్లి చేసుకోలేదు.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
The Raja Saab Pre Release Event

Updated on: Dec 27, 2025 | 10:38 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ తో పాటు చాలా మంది స్టార్స్ ఈ మూవీలో భాగమయ్యారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. హీరో ప్రభాస్ తో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరైంది. అలాగే ప్రభాస్ అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా యాంకర్ సుమ ప్రభాస్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు ఇదే క్రమంలో కొంతమంది అభిమానులు ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటూ ఒక ప్ల కార్డు పట్టుకుని కనిపించారు. దీనిని చూసిన సుమ వెంటనే ప్రభాస్ దగ్గరకు వెళ్లింది. ‘ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా ఒక క్వాలిటీ చెప్పండి’ అని ప్రభాస్ ను అడిగింది. దీనికి ప్రభాస్ ‘ ఆ క్వాలిటీ ఏదో తెలియకనే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను’ అంటూసమాధానం ఇచ్చారు. దీంతో సుమతో పాటు అతిథులు, ఆడియెన్స్ నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం పెళ్లి గురించి ప్రభాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియో ఇదిగో..

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.