Prabhas: మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. షూటింగ్లో పాల్గొంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. బయటకూడా కనిపించింది తక్కువే.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రభాసే కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ వచ్చాక మనకు అందుబాటులో వుండరేమో అనుకున్నవాళ్లంతా.. ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకనుకుంటున్నారా.. ఇప్పుడు చిన్న సినిమాల పాలిట స్పెషల్ ప్రమోటర్‌గా మారాడు బాహుబలి ప్రభాస్. సుధీర్‌బాబు హీరోగా చేసిన శ్రీదేవి సోడా సెంటర్ కోసం ఫుల్ ప్లెడ్జ్‌డ్ ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. తాను మల్టిపుల్ మూవీస్‌తో బిజీగా వుంటూనే.. ప్రొడ్యూసర్ విజయ్ చిల్లా కోరికను మన్నించి.. అరగంట పాటు టీమ్‌తో కనిపించారు. కట్‌చేస్తే… ఇప్పుడు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది శ్రీదేవి సోడాసెంటర్.
అంతకుముందు.. నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసిన జాతిరత్నాలు సినిమాకు కూడా ప్రభాసే ఆపద్బాంధవుడయ్యాడు. జాతిరత్నాలు టీమ్‌ని ముంబైకి పిలిపించుకునిమరీ.. విష్ చేసి పంపాడు డార్లింగ్. అప్పట్లో డార్లింగ్ ఇచ్చిన ఈ జోవియల్ అప్పియరెన్స్ జాతిరత్నాలకు బాగా ప్లస్సయింది. తనకు ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చిన వర్షం డైరెక్టర్ శోభన్ రుణం కూడా ఇలాగే తీర్చుకున్నాడు ప్రభాస్. శోభన్ తనయుడు సంతోష్ డెబ్యూ మూవీ ఏక్ మినీ కథ ట్రయిలర్‌ని తన చేతుల మీదుగానే లాంచ్ చేసి.. గో ఎహెడ్ చెప్పారు. ఇలా ఆబ్లిగేషన్స్‌నేవీ వదిలిపెట్టకుండా తన-మన తేడా లేకుండా అన్ని సినిమాల్నీ ప్రమోట్ చేస్తూ.. మీడియాలో కనిపిస్తున్నాడు ఈ ఆదిపురుష్. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేసి సలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అలాగే ఈ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్లోనూ జాయిన్ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలతోపాటు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. త్వరలోనే ఆ సినిమా సెట్లోను అడుగు పెట్టనున్నాడు ప్రభాస్.
మరిన్ని ఇక్కడ చదవండి :