Prabhas: డార్లింగ్‌కు షాక్.. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్‌

ఎట్ ప్రజెంట్.. పాన్ ఇండియన్ సినిమాలతో.. యామా బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ .. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో అందులోనూ.. ఫేస్‌ బుక్లో ప్రత్యక్షమయ్యారు. తన అప్‌కమింగ్ సినిమా అప్డేట్స్‌ గురించే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఈ స్టార్.. తాజాగా తన ఎఫ్‌బీ అకౌంట్‌ హ్యాంక్ అయిందంటూ..

Updated on: Jul 29, 2023 | 9:43 AM

ఎట్ ప్రజెంట్.. పాన్ ఇండియన్ సినిమాలతో.. యామా బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ .. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో అందులోనూ.. ఫేస్‌ బుక్లో ప్రత్యక్షమయ్యారు. తన అప్‌కమింగ్ సినిమా అప్డేట్స్‌ గురించే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఈ స్టార్.. తాజాగా తన ఎఫ్‌బీ అకౌంట్‌ హ్యాంక్ అయిందంటూ.. చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఎస్ ! ఇన్‌స్టా ట్విట్టర్‌లా.. కాకుండా.. దాదాపు 11 ఏళ్ల క్రితమే.. ఎఫ్‌బీలోకి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్‌.. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇందులో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. తన ఫ్రెండ్స్‌ అండ్ తోటి సెలబ్రిటీస్‌కు బర్త్‌ డే విషెస్ లాంటి చెబుతూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈయన ఎఫ్‌ బీ అకౌంట్‌లో గురువారం అంటే జూలై 27న మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్‌తో… ఓ వీడియో పోస్ట్ అయింది.

ఇక ఈ వీడియో చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌.. ప్రభాస్ ఎఫ్‌బీ అకౌంట్ హ్యక్ అయిందంటూ ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. అది ప్రభాస్తో పాటు.. ఆయన నియర్ అండ్ డియర్స్‌ వరకు రీచ్ అయ్యేలా చేశారు. ఇక దీంతో ప్రభాస్‌ తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ.. తన ఇన్‌స్టా స్టోరీలో మెన్షన్ చేశారు. దాంతో పాటే.. తన టీంను రంగంలోకి దింపి.. హ్యాక్ అయిన తన ఎఫ్‌బీ అకౌంట్‌ను తిరిగి రికవరీ చేసుకున్నారు.