Prabhas: బాలయ్య షోలో కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్.. పంటి బిగ్గువన బాధను భరిస్తూ..

|

Jan 06, 2023 | 7:20 PM

ఈ క్రమంలో ఈ రోజు రెండో భాగాన్ని స్ట్రీమింగ్ చేశారు ఆహా టీమ్. ఎపిసోడ్ ఫస్ట్  పార్ట్ లో  ప్రభాస్ ఒక్కడే హాజరై సందడి చేశారు. ఇక ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోన్న సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఫ్రెండ్ గోపిచంద్ కూడా హాజరయ్యాడు.

Prabhas: బాలయ్య షోలో కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్.. పంటి బిగ్గువన బాధను భరిస్తూ..
Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ కు హాజరయిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ రోజు(జనవరి 6న) రెండో భాగాన్ని స్ట్రీమింగ్ చేశారు ఆహా టీమ్. ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ఒక్కడే హాజరై సందడి చేశారు. ఇక ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోన్న సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఫ్రెండ్ గోపిచంద్ కూడా హాజరయ్యాడు. ఈ ఇద్దరు కలిసి బాలయ్యతో సందడి చేశారు. ఇద్దరినీ ఇరుకున పెట్టె ప్రశ్నలతో ఆటపట్టించారు. అలాగే గోపీచంద్ ఫీల్ కెరీర్ గురించి, బాల్యం గురించి. ఆయన తండ్రి గురించి అడిగారు బాలకృష్ణ. ఇక గోపీచంద్ కు నెక్ట్స్ సినిమా టైటిల్ కూడా పెట్టేశారు బాలయ్య. రామబాణం అనే టైటిల్ పెట్టుకో వందరోజుల ఫంక్షన్ కు నేను వస్తా అని అన్నారు బాలయ్య.

ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్, కృష్ణం రాజు కలిసున్న ఫోటోలను చూపించారు. అలాగే ప్రభాస్ గురించి కృష్ణం రాజు చెప్పిన మాటలను వీడియో రూపంలో చూపించారు. ఈ వీడియోలో కృష్ణం రాజు ప్రభాస్ గురించి చెప్తూ చాలా గర్వంగా ఉంది. నన్ను మించిపోయాడు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ వీయస్యో చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రభాస్. అనంతరం కృష్ణం రాజుకు నివాళులు అర్పిస్తూ మౌనాన్ని పాటించారు. ఆసమయంలో పంటిబిగువున బాధను బిగపట్టి ఉన్నాడు ప్రభాస్. చమర్చన కళ్ళతో ఉన్న ప్రభాస్ ను చూసి బాలయ్య కూడా ఎమోషనల్ అయ్యారు. నా కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు బాలయ్య.

ఇవి కూడా చదవండి