
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా 21 ఏళ్లు పూర్తిచేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ‘ఈశ్వర్’ సినిమాతో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా 2002 నవంబర్ 11న విడుదలై అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ మూవీలో ధూల్ పేట్ ఈశ్వర్ పాత్రలో ప్రభాస్ మాస్ లుక్‌లో దుమ్ములేపాడు. ఈ సినిమా విడుదలై 21 ఏళ్లు పూర్తైంది. దీంతో ప్రభాస్‌కు సినీ తారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ఆ తర్వాత తన నటనతోనే ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అప్పట్లో రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.4 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా నటించింది. మొదటి సినిమాతోనే మాస్ యూత్ అడియన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్.
హీరోగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ఆయన నటించిన రాఘవేంద్ర సినిమా సైతం నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఈ సినిమా అప్పట్లో రూ.21 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఇండస్ట్రీలో ప్రభాస్ క్రేజ్ మారిపోయింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోగా ఫాలోయింగ్ అందుకున్నాడు. ఇక జక్కన్న రూపొందించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ఈ మూవీ తర్వాత సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న సలార్, కల్కి చిత్రాలపై ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
21 Years of Dominance in the Film Industry 👑
Celebrating Rebel Star #Prabhas‘ indelible mark of Charisma and Excellence 🌟#21YearsOfRebelstarPrabhas pic.twitter.com/QnLc3HBpKY
— UV Creations (@UV_Creations) November 11, 2023
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీతోపాటు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలో హీరోగా ప్రభాస్ 21 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వి్ట్టర్ వేదికగా తమ అభిమాన హీరోకి ప్రత్యేకంగా రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ప్రభాస్ కొత్త పోస్టర్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.