AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ట్రిపులార్‌ తర్వాత ఆ ఘనత సాధించిన మూవీగా ఆదిపురుష్‌ రికార్డ్‌..

ఆదిపురుష్‌.. ఇప్పుడు ఎక్కడా విన్నా ఈ పేరు మారుమోగుతోంది. ప్రభాస్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 7వేలకి పైగా థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోందీ మూవీ. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు...

Adipurush: ట్రిపులార్‌ తర్వాత ఆ ఘనత సాధించిన మూవీగా ఆదిపురుష్‌ రికార్డ్‌..
Adipurush Collections
Narender Vaitla
|

Updated on: Jun 16, 2023 | 8:30 AM

Share

ఆదిపురుష్‌.. ఇప్పుడు ఎక్కడా విన్నా ఈ పేరు మారుమోగుతోంది. ప్రభాస్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 7వేలకి పైగా థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోందీ మూవీ. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం పక్కానని సినీ క్రిటిక్స్‌ అభిప్రాయపడుతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా విజువల్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందే ఆదిపురుష్‌ పలు రికార్డులను తిరగరాసింది. అత్యధిక థియేటర్లలో విడుదలై అరుదైన రికార్డును సాధించుకున్న ఈ సినిమా మరో గుర్తింపును సంపాదించుకుంది. ట్రిపులార్‌ సినిమా తర్వాత అరుదైన గౌరవాన్ని దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆన్‌లైన్‌ సినిమా టికెట్‌ బుకింగ్ పోర్టల్‌ ‘బుక్‌ మై షో’లో ఈ రికార్డును దక్కించుకుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో 10లక్షలమంది ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ యాప్‌లో ఇప్పటి వరకు 1.75 మిలియన్‌ ఇంట్రెస్టులతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు 1 మిలియన్‌ లైక్స్‌తో ‘ఆదిపురుష్‌’ రెండో స్థానంలో నిలిచింది.

ఇదిలా ఉంటే టికెట్ల విషయంలోనూ ఆదిపురుష్‌ పాత రికార్డులను బద్దలు కొట్టింది. సౌత్‌ ఇండియాతో పాటు నార్త్‌లోనూ ఆదిపురుష్‌ ఓపెనింగ్స్‌లో దూసుకుపోతోంది. సోషల్‌ మీడియా వేదికగా కూడా ఆదిపురుష్‌కి సెలబ్రిటీల నుంచి మద్ధతు లభిస్తోంది. సినిమా హిట్‌ కావాలంటూ బాలీవుడ్‌ మొదలు టాలీవుడ్‌ వరకు పలు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన