Adipurush: ‘ఆదిపురుష్’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

అయితే టీజర్ విషయంలో అనేక విమర్శలు వచ్చినప్పటికీ.. ట్రైలర్‏తో వాటన్నింటికీ గట్టిగానే కౌంటరిచ్చింది చిత్రయూనిట్. వీఎఫ్ఎక్స్ మార్పులనంతరం రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఏరెంజ్‏లో ఉండబోతుందో తెలియజేసింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఓవైపు ఇటీవల విడుదలైన సీతమ్మ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రాగా... తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం.

Adipurush: ఆదిపురుష్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
Adipurush

Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 3:42 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మొదటిసారి రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండడంతో ఆదిపురుష్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అయితే టీజర్ విషయంలో అనేక విమర్శలు వచ్చినప్పటికీ.. ట్రైలర్‏తో వాటన్నింటికీ గట్టిగానే కౌంటరిచ్చింది చిత్రయూనిట్. వీఎఫ్ఎక్స్ మార్పులనంతరం రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఏరెంజ్‏లో ఉండబోతుందో తెలియజేసింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఓవైపు ఇటీవల విడుదలైన సీతమ్మ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రాగా… తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం.

తాజాగా విడుదలైన పోస్టర్ లో హనుమంతుడిపై రాముడు నిల్చోని విల్లు సంధిస్తున్నాడు. ఈ పోస్టర్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. ఇందులో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో మంచి విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది.

ఈ చిత్రాన్ని జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలో విడుదల చేయనున్నారు. ఓవైపు ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతుండగా.. మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.