పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ గ్యాప్ దొరికిన ప్రతిసారి సినిమా షూటింగ్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమిళ్ లో ఘానా విజయం సాధించిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమా కథలో చాలా మార్పులు చేర్పులు చేశారట త్రివిక్రమ్. ఒరిజినల్ లా ఉండదు అని సముద్రఖని గట్టిగానే చెప్తున్నారు. జులై 28న బ్రో మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోన్షన్స్ లో స్పీడ్ పెంచింది చిత్రయూనిట్.
తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. బ్రో మూవీకి క్లిన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. అలాగే ఈ సినిమా పై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు సెన్సార్ సభ్యులు. ఈ సినిమాలో పవర్ స్టార్ ఎలివేషన్స్.. ఆయన నుంచి అభిమానులు కోరుకునే స్టఫ్ ఉందని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా రన్ టైమ్ 2 గంట 14 నిమిషాలు ఉందట. బ్రో సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్న ఫ్యాన్స్. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు బ్రో మూవీతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. అలాగే జులై 25న ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు.