BheemlaNayak: పండగ మొదలైంది.. బరిలోకి బీమ్లా నాయక్.. పవన్-రానా పవర్ ప్యాక్‌‌‌డ్ వీడియో వచ్చేసింది..

వీడు ఆరడుగుల బుల్లెట్టు... పవర్‌కే ప్యాకెట్టు.. ఫాలోయింగ్‌లో ఎవరెస్టు... ! రికార్డుల పనిపట్టు.. ! మంచితనంతో చేయు కనికట్టు. అభిమానులకు పవర్ స్టార్ బానిసైనట్టు...!

BheemlaNayak: పండగ మొదలైంది.. బరిలోకి బీమ్లా నాయక్.. పవన్-రానా పవర్ ప్యాక్‌‌‌డ్ వీడియో వచ్చేసింది..

Updated on: Aug 15, 2021 | 9:55 AM

Pawan Kalyan: వీడు ఆరడుగుల బుల్లెట్టు… పవర్‌కే ప్యాకెట్టు.. ఫాలోయింగ్‌లో ఎవరెస్టు… ! రికార్డుల పనిపట్టు.. ! మంచితనంతో చేయు కనికట్టు. అభిమానులకు పవర్ స్టార్ బానిసైనట్టు…! ఇవి పవన్‌ గురించి ప్రతీ అభిమాని కాలర్‌ ఎగిరేసి మరీ చెప్పే మాటలు. పోలీస్ డ్రస్‌‌‌‌లో ఆన్‌స్క్రీన్‌ పై పవన్‌‌‌ను చూస్తుంటే దిమ్మతిరిగిపోవాల్సిందంతే..!ఫ్యాన్స్‌‌‌‌కు పూనకాలు రావాల్సిందే. ఇక ఆయన ప్రసంగిస్తే.. ప్రళయం…! స్క్రీన్‌ పై డైలాగులు చెబితే ప్రభంజనం… అభిమానులతో ముచ్చటిస్తే శాంతం.. అన్నింటిలోనూ సహనం.. మూడు ముక్కల్లో చెప్పాలంటే… ఇదీ పవన్‌ నైజం…!

ఆయకున్న క్రేజ్‌ అలాంటిది గనుక. వన్స్‌ ఆయన మేనియాను గుర్తుకు తెచ్చుకున్నారా… ఇక అంతే ప్లోలో.. ఉపోద్ఘతం రావడమే కాదు.. ఒంటిపైనున్న రోమాలు కూడా లేచి నిలబడితాయి. చేసిన కొన్ని సినిమాలతోనే కొండంత క్రేజ్‌ను సంపాదించుకున్న పవన్‌ మూడేళ్ళ గ్యాప్  తరువాత తిరిగి వకీల్ సాబ్‌‌‌‌గా మన ముందుకు వచ్చారు పవన్‌. ఇక వకీల్‌ సాబ్‌ బొనాంజాతో పవన్‌ సెకండ్‌ ఫేజ్‌.. సక్సస్‌ ఫుల్‌‌‌‌గా సాగుతోంది. ఇప్పటికే యంగ్‌ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు లైన్లో పెట్టిన పవన్‌.. వాటన్నింటిని సూపర్‌ ఫాస్ట్‌‌‌‌గా కంప్లీట్‌ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ట్రై చేయడమే కాదు.. హరి హర వీరమల్లు వంటి పీరియాడికల్ కథతో సరికొత్తగా వస్తున్నారు. వకీల్ సాబ్‌ను ఇంకా మరవక ముందే.. భీమ్లా నాయక్‌గా వచ్చేస్తున్నారు పవన్‌. తనకే సెట్ అయ్యే ఖాకీ డ్రెస్సులో… తనకు క్రేజ్‌ తెచ్చిపెట్టిన పోలీసు గన్నుతో.. గబ్బర్‌ సింగ్‌ కామెడీ పోలీస్‌లా కాకుండా… స్ట్రిక్ట్ పోలీస్‌ భీమ్లా నాయక్‌లా.. మన ముందుకు రాబోతున్నారు. త్రివిక్రమ్‌ మాటల్ని మరోసారి తన గొంతుతో వినిపించబోతున్నారు.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాళ్ రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో.. సాగర్‌ చంద్ర డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న.. ఈ సినిమాను ప్రస్తుతం ప్రొడక్షన్‌ నెం 12 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్‌, రానా ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్‌ను.. ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మూవీ మేకర్స్‌. పవన్‌ పవర్‌కి భీమ్లా నాయక్‌ నేమ్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుండడంతో ఇదే పేరును ఖరారు చేశారు. భీమ్లా నాయక్‌… వస్తున్నాడు అంటూ లేటెస్ట్‌‌‌‌గా రిలీజైన గ్లిమ్స్ వీడియో… పవన్ ఫ్యాన్స్‌‌‌‌ని ఎలెర్ట్ చేసింది. పోలీస్‌ యూనిఫామ్‌లో.. రొమ్ములు విరుచుకుని నడిచొచ్చే తీరు.. పెరిగిన ఛాతీ సైజు.. కళ్ళల్లో ఆ ఉరిమే ఉరుము… అన్నీ పవన్ లో కొత్త పోలీస్ ని చూపిస్తున్నాయి అనేది ఫస్ట్ టాక్. సినిమా దద్దరిల్లిపోతుందంతే అనేది సెకండ్‌ టాక్. అందులోనూ పవర్ బీజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన థమన్‌ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో.. భీమ్లా నాయక్ గ్లిమ్స్‌తో అంచనాలకు మించి… ఇండస్ట్రీని.. ఇంటర్నెట్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తుందనండంలో…అసలు డౌటే లేదు..

 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh : సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన బండ్ల గణేష్.. అభిమానులకు భారీ నిరాశ

Bigg Boss 5: ఈసారి బిగ్‌బాస్‌ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరించేంది ఎవరో తెలుసా.? లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన బోల్డ్‌ బ్యూటీ.

Vijay’s Beast : బీస్ట్ సినిమాకు బెస్ట్ బిజినెస్.. భారీ ధరకు అమ్ముడు పోయిన దళపతి విజయ్ సినిమా ఓటీటీ రైట్స్