Bheemla Nayak: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. భీమ్లానాయక్‌ ట్రైలర్‌ వచ్చేది అప్పుడే..

|

Feb 19, 2022 | 6:51 PM

Bheemla Nayak Trailer date: వకీల్‌సాబ్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత పవర్ స్టార్‌ నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్‌. ఈ సినిమాపై అటు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన..

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. భీమ్లానాయక్‌ ట్రైలర్‌ వచ్చేది అప్పుడే..
Bheemla Nayak Trailer
Follow us on

Bheemla Nayak: వకీల్‌సాబ్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత పవర్ స్టార్‌ నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్‌. ఈ సినిమాపై అటు పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ  సినిమా ఫిబ్రవరి 25న విడుదలకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ సాంగ్‌, టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. రానా, పవన్‌ కళ్యాణ్‌ పోటీపడీ మరీ నటించినట్లు ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.

సినిమా తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్‌పై దృష్టి పెట్టిన చిత్ర యూనిట్ ఈ నెల 21 హైదరాబాద్ యూసుఫ్‌ గూడాలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర దర్శకుడు స్వయంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే శనివారం భీమ్లా నాయక్‌ ట్రైలర్ రానుందని అందరూ ఊహించారు. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను కూడా ప్రిరిలీజ్‌ ఈవెంట్ రోజే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిత్యామీనన్‌, రానాకు జోడిగా సంయుక్తీ మీనన్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పన్‌ కోషియమ్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.

Also Read: TS Government: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల అధిక  ఫీజులకు చెక్‌..!

K. Viswanath: కళాతపస్వి కే.విశ్వనాథ్ పుట్టిన రోజు నేడు.. మెగాస్టార్ స్పెషల్ విషెస్

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. జాతర మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్