Posani Krishna Murali : పవన్‌ కల్యాణ్‌ను కేసీఆర్‌ బహిరంగంగా హెచ్చరించారు.. అప్పుడు పవన్ ఫ్యాన్స్‌ ఏం చేశారు..? – పోసాని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి..

Posani Krishna Murali : పవన్‌ కల్యాణ్‌ను కేసీఆర్‌ బహిరంగంగా హెచ్చరించారు.. అప్పుడు పవన్ ఫ్యాన్స్‌ ఏం చేశారు..? - పోసాని
Posani

Updated on: Sep 28, 2021 | 9:18 PM

Posani Krishna Murali : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి.. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులూ సినీ ప్రముఖులు స్పందించారు. ఇటీవల పోసాని కృష్ణ మురళి కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మరోసారి మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తప్పు చేస్తే విమర్శించే అధికారం అందరికి ఉంది.. తప్పు చేస్తే ఆరోపించాలి తప్పులేదు.. కానీ ఏ తప్పు లేకుండా పవన్ మాట్లాడుతున్నారు.. ‘ఒకసారి పవన్ నన్ను ఫోన్ చేసి తిట్టాడు..షూటింగ్‌కు వస్తే..  నేను 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 కి వెళ్ళిపోతా.. ఆ రోజు నా ఆరోగ్యం బాగాలేక సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోయాను..అయితే పవన్ జనసేన కార్యక్రమాలు అన్ని చూసుకొని వచ్చిన తర్వాత  షూటింగ్ కు వచ్చాడు. అప్పుడు షూట్‌కు రమ్మని మేనేజర్ ఫోన్ చేశారు. 9గంటలకు షూట్ అన్నారు. సరే అని వెళ్లి  నైట్ 7 గంటల నుంచి 9-30 వరకు వెయిట్ చేశాను..ఎవ్వరూ రాలేదు.. దాంతో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా.. రాత్రి 10… 10-30 కు ఫోన్ చేశాడు పవన్.. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఎలా వెళ్ళిపోతారు.. మేము పిచ్చళ్ళలా కనిపిస్తున్నామా.. అంటూ అరిచేశాడు. దానికి నేను కూడా గట్టిగానే సమాధనం చెప్పా.. నీ కోసం మేము వెయిట్ చేయాలా నువ్వు ఎప్పుడంటే అప్పుడే షూటింగా.. నువ్వు ఆర్టిస్ట్‌వే నేను ఆర్టిస్ట్‌నే.. మాకు పెళ్ళాం  పిల్లలు ఉండరా… అని నేను సీరియస్ అయ్యా.. దానికి ఆయన నాకు సారి చెప్పాడు.. ఆ తర్వాత నన్ను సినిమా నుంచి తీసాడు. అప్పటి నుంచి పవన్‌కు నా మీద కోపం అన్నారు పోసాని. నిన్న ప్రెస్ మీట్ తర్వాత పవన్ ఫ్యాన్స్‌ నాకు అసహ్యంగా మెసేజులు చేస్తున్నారు.. నా కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అన్నారు పోసాని..

పోసాని లైవ్ ఇక్కడ చూడండి ..