కాలేజ్ ఫీజ్ కట్టడం కోసం అలా చేయాల్సి వచ్చింది.. అందం అనేది ఒక శాపంగా మారింది : పూనమ్ కౌర్

పూనమ్ కౌర్.. ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో అలరించిన నటి. ప్రస్తుతం నెట్టింట ఓ హాట్ టాపిక్. ఆమె ఏ ట్వీట్ చేసినా, పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ‘మాయాజాలం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్.. తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, గగనం, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది.

కాలేజ్ ఫీజ్ కట్టడం కోసం అలా చేయాల్సి వచ్చింది.. అందం అనేది ఒక శాపంగా మారింది : పూనమ్ కౌర్
Poonam Kaur

Updated on: Jan 02, 2026 | 10:40 AM

నటి పూనమ్ కౌర్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన పూనమ్. ఆతర్వాత పలు సహాయక పాత్రలు చేసింది. ఆతర్వాత ఉన్నటుండి సినిమాలు దూరం అయ్యింది. పూనమ్ సినిమాలకు దూరంగా ఉంటున్నా.. పలువురి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్ని సార్లు వార్తల్లో నిలిచింది. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో  తన జీవితంలోని వివిధ కోణాలను, ఎదురైన కఠినమైన సంఘటనలను పంచుకుంది.. తాను కేవలం హోమ్‌మేకర్‌గా ఉంటూ సామాజిక సేవ చేయాలనుకుంటున్నానని, తన ఆశయాలను ఇతరులు అపహాస్యం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది పూనమ్ కపూర్.

నువ్వు చనిపోతే ఒక రోజు వార్తగా మాత్రమే మిగులుతావు అని కొందరు కామెంట్స్ చేయడం బాధకలిగించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా పూనమ్ కౌర్ తన ప్రిన్సిపల్స్‌ను ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. తనకు అల్లు అర్జున్ సినిమాకు మొదటి అవకాశం వచ్చినా, తేజకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను అని తెలిపింది పూనమ్. అయితే ఇండస్ట్రీలో తాను ఏ దర్శకుడినీ అవకాశం కోసం అడగలేదని, కేవలం ఆడిషన్స్ మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశారు. తేజ లాంటి దర్శకులు మీరు ఇండస్ట్రీకి సరిపోరు అని చెప్పినా కూడా కేవలం కాలేజ్ ఫీజ్ కట్టడం కోసం నటించక తప్పలేదు.

తన తండ్రి చిన్నతనంలోనే చనిపోయారని, ఒక కళాకారుడిని రక్షించబోయి ప్రమాదంలో మరణించారని తెలిపింది. తనకు పెళ్లి చేసుకోవాలని, పిల్లలు ఉండాలని ఆశ ఉందని, అయితే నువ్వు ఇక్కడ సెట్ అవ్వవు వంటి మాటలు వినాల్సి వచ్చిందని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. తన తల్లి కూడా తన కారణంగానే రెండోసారి కన్నీళ్లు పెట్టుకుందని, కనీసం ఫోటోలు దిగడం అంటే ఇష్టం లేని కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు రావడం చిన్న విషయం కాదని ఆమె చెప్పింది. తనను సరైన హౌస్‌వైఫ్ మెటీరియల్ గా వర్ణించడాన్ని ఆమె అంగీకరిస్తూ, పరిశ్రమలో సర్దుకుపోలేకపోయానని చెప్పింది. సమాజంలో అందం అనేది ఒక శాపంగా మారిందని, ముఖ్యంగా మహిళలకు ఇది నిజమని పూనమ్ తెలిపింది. తన దృష్టిలో, మన నమ్మకం, కుటుంబం, భవిష్యత్తు నుంచి మనలను వేరుచేసేవాడే రాక్షసుడు అని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.