
పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే ఈ అమ్మడు తన కామెంట్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. పూనమ్ కౌర్ కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలిచినింది. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే విషయాల పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని ప్రత్యేక పూజలు చేసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు జైలు ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ డవలప్ మెంట్ స్క్యామ్ కేసులో ఆరోపణలు నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు బయటకు రావాలని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు పై రిమాండ్ కొనసాగుతోంది.
ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పూనమ్ తన కుటుంబసభ్యులతో అమ్మవారిని దర్శించికున్నారు. పూనమ్ కౌర్ కు అర్చకులు తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.
పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. చంద్రబాబు జైలు లో ఉండటం చాలా బాధాకరం. ఆయన ఈ వయసులో చంద్రబాబు జైల్లో ఉండటం నన్ను కలచి వేసింది. ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని అమ్మవారిని వేడుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది. పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్ నవంబర్ 9 వరకు ఉంది ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ వర్గం.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..