Thalapathy Vijay: విజయ్ బెదిరిస్తున్నారు.. వెంటనే అరెస్ట్ చేయండి.. దళపతి పై సంచలన ఆరోపణలు చేసిన ప్రియ..

|

Jul 07, 2023 | 3:10 PM

ఇటీవలే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేయగా.. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ ఆకట్టుకుంది. ఓవైపు యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సాంగ్ మరోవైపు వివాదంలోనూ చిక్కుకుంది. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు.

Thalapathy Vijay: విజయ్ బెదిరిస్తున్నారు.. వెంటనే అరెస్ట్ చేయండి.. దళపతి పై సంచలన ఆరోపణలు చేసిన ప్రియ..
Vijay
Follow us on

సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్. తమిళంతోపాటు.. తెలుగులోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేయగా.. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ ఆకట్టుకుంది. ఓవైపు యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సాంగ్ మరోవైపు వివాదంలోనూ చిక్కుకుంది. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. అందులో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఒకరు. అంతేకాకుండా ఆమె గతంలో అనేకసార్లు విజయ్ ను టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేసింది. ఇక ఇప్పుడు మరోసారి సెన్సెషన్ కామెంట్స్ చేసింది.

హీరో విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని ఆమె చెన్నై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయ్ సినిమాలో స్మోకింగ్ వీడియోస్ పై నిరసనలు చేసినందుకే హీరో విజయ్ అబిమానులు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా మాట్లాడుతూ నిరంతం బెదిరిస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా విజయ్ సోషల్ మీడియా ఐడీని ట్యాగ్ చేస్తూ తనపై అసభ్యపదజాలంతో కామెంట్స్ చేస్తున్నారని.. హీరో విజయ్ కూడా తనను బెదిరించాడని తెలిపింది. ఓ మహిళగా తనను అవమానపరుస్తూ మాట్లాడేలా తన అభిమానులను రెచ్చగొట్టిన విజయ్ దళపతిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

లియో చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ లో స్మోకింగ్, రౌడీయిజం ఎక్కువగా చూపించారని.. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందని పాటలో ఉన్నాయని తెలిపింది. గతంలో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయని సూపర్ స్టార్ రజినీకాంత్ పై కూడా ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది ప్రియా. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.