SitaRamam: ‘సీతారామం’ యూనిట్‏కు పోలాండ్ అభిమాని నాలుగు పేజీల ప్రేమలేఖ.. దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ రిప్లై..

|

Sep 18, 2022 | 8:25 AM

అలాగే.. తాజాగా సీతారామం చిత్రయూనిట్‏కు కొందరు పోలాండ్ దేశానికి చెందిన ఓ అభిమాని అందమైన ప్రేమ లేఖ రాశారు. ఇది చూసిన భావోద్వేగ రిప్లై ఇచ్చారు దుల్కర్ సల్మాన్.

SitaRamam: సీతారామం యూనిట్‏కు పోలాండ్ అభిమాని నాలుగు పేజీల ప్రేమలేఖ.. దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ రిప్లై..
Sitaramam
Follow us on

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించిన అందమైన ప్రేమకావ్యం సీతారామం (SitaRamam). చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకింది. కశ్మీర్ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఓ అనాథ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ రామ్‏గా.. దుల్కర్ సల్మాన్.. యువరాణి నుర్జాహాన్ అలియాస్ సీతామహాలక్ష్మీ పాత్రలలో మృణాల్ ఒదిగిపోయారు. వీరిద్దరి సహజనటనకు.. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. డైరెక్టర్ హాను స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు ఓటీటీలోనూ సీతారామం చిత్రానికి ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే ఈ మూవీలోని పలు డైలాగ్స్…సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే.. తాజాగా సీతారామం చిత్రయూనిట్‏కు కొందరు పోలాండ్ దేశానికి చెందిన ఓ అభిమాని అందమైన ప్రేమ లేఖ రాశారు. ఇది చూసిన భావోద్వేగ రిప్లై ఇచ్చారు దుల్కర్ సల్మాన్.

2006 నుంచి భారతీయ సినిమా.. సంగీతానికి పోలాండ్ అభిమాని అయిన మోనికా తన ట్విట్టర్ ఖాతా ద్వారా సీతారామం టీంపై ప్రేమను కురిపిస్తూ నాలుగు పేజీలతో కూడిన ప్రత్యేకమైన లేఖ రాసింది. అంతేకాదు.. ఈ సినిమాను షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా నటించిన వీర్ జారా చిత్రంతో పోల్చింది. స్వచ్చమైన ప్రేమకథ అంటూ చెప్పుకొచ్చింది. ఈ లేఖపై హీరో దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. అందమైన లేఖ.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మిమ్మల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నాను. సినిమా పట్ల మీరు గొప్ప అవగాహనతో రాశారు. మీ ప్రతిభకు హాట్సాఫ్ అంటూ దుల్కర్ సల్మాన్ రిప్లై ఇచ్చారు.

ఇక లేఖలో మోనికా.. నేను లెఫ్టినెంట్ రామ్ ప్రేమలో పడిపోయాను.. అతడిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నారు. అంత అద్భుతమైన పాత్రను సృష్టించారు. అలాగే సీత పాత్రలో మరెవరినీ ఊహించుకోలేకపోతున్నాను మృణాల్. మీరు నా మనసును గెలుచుకున్నారు. ప్రతి ఫ్రేములో ఎంతో అందంగా కనిపించారు. ఓ అందమైన దేవకన్యగా కనిపించారు. అలాగే మీకు గాత్రం అందించిన సింగర్ చిన్మయి శ్రీపాద లేకుండా సీతామహాలక్ష్మీ అసంపూర్ణం. సీతారామం చిత్రయూనిట్‏కు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.