హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే.. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఇప్పటికే లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కూడా లావణ్య పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆమె మరో వ్యక్తితో ఉంటుందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. చాలా రోజులుగా ఈ వ్యవహారం సాగుతోంది. లావణ్య రాజ్ తరుణ్ ను విడిచిపెట్టే సమస్యే లేదు అని అంటుంది. తాజాగా రాజ్‌తరుణ్- లావణ్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్ మోసం చేశారంటూ నటి లావణ్య కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.
తాజాగా కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. చార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. రాజ్‌తరుణ్- లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. రాజ్‌తరుణ్- లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని.. లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఇక.. లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్‌తరుణ్.
విచారణలో భాగంగా లావణ్య ఇంట్లో సాక్ష్యాలను సేకరించారు పోలీసులు. అనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. లావణ్య ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించిన తర్వాతే రాజ్ తరుణ్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చాము అని పోలీసులు తెలిపారు. పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చడంతో అతని పెద్ద షాక్ తగిలింది. మరి దీని పై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.