కంగనా రనౌత్‌పై కేసు న‌మోదు..రీజన్ ఇదే..

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. ముంబైకి చెందిన అడ్వకేట్‌ అలీ కాషిఫ్‌ ఖాన్‌ దేశ్‌ముఖ్‌ కంగనాపై పోలీసులకు కంప్లైట్ చేశారు. కొన్నిరోజుల క్రితం యూపీలోని మొరదాబాద్‌లో కరోనాతో చ‌నిపోయిన‌ ఓ జమాతీ ఫ్యామిలీకి మెడిక‌ల్ టెస్టుల చేయటానికి వెళ్లిన డాక్టర్లు, పోలీసులపై వారు దాడి చేశారు. ఈ సంఘటనపై స్పందించిన కంగ‌నా సోద‌రి రంగోలి చందేల్‌ ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్‌ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చిపడేయాలని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. […]

కంగనా రనౌత్‌పై కేసు న‌మోదు..రీజన్ ఇదే..

Updated on: Apr 24, 2020 | 10:15 PM

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. ముంబైకి చెందిన అడ్వకేట్‌ అలీ కాషిఫ్‌ ఖాన్‌ దేశ్‌ముఖ్‌ కంగనాపై పోలీసులకు కంప్లైట్ చేశారు. కొన్నిరోజుల క్రితం యూపీలోని మొరదాబాద్‌లో కరోనాతో చ‌నిపోయిన‌ ఓ జమాతీ ఫ్యామిలీకి మెడిక‌ల్ టెస్టుల చేయటానికి వెళ్లిన డాక్టర్లు, పోలీసులపై వారు దాడి చేశారు. ఈ సంఘటనపై స్పందించిన కంగ‌నా సోద‌రి రంగోలి చందేల్‌ ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్‌ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చిపడేయాలని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అవి విద్వేషాలు చెట్ట‌గొట్టేలా ఉండ‌టంతో.. రంగోలి చందేల్‌ ట్విటర్ అకౌంట్ ను అధికారులు బ్లాక్ చేశారు.

ఈ ఇష్యూపై కంగనా స్పందిస్తూ కొద్దిరోజులక్రితం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన సోదరి రంగోలి చందేల్‌‌ ట్విటర్ అకౌంట్ ను తొలిగించటాన్ని ఆమె తప్పుబట్టారు. గతంలో రంగోలి చేసిన వ్యాఖ్యలను స‌మ‌ర్ధించ‌డంతో పాటు సదరు వర్గానికి చెందిన వారిని టెర్రరిస్టులని కంగనా అభివ‌ర్ణించారు. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవ్వ‌డంతో అడ్వ‌కేట్ అలీ పోలీసులను ఆశ్రయించారు.