
నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై కేసు ఫైల్ అయ్యింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర 9 కోట్ల 35 లక్షల రూపాయిలు కాజేసిందంటూ లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ధర్మేంద్ర హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ షేక్‌పేట్‌కు చెందిన వైవి ధర్మేంద్ర సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ లండన్‌లో స్థిరపడ్డాడు. 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషురెడ్డి తనకు పరిచడమైందని… అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్టు చెప్పిందని కంప్లైంట్‌లో తెలిపాడు.
పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని… పెళ్లి చేసుకుందామని నమ్మించిందని ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడుగుతూ.. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుందన్నాడు. అషురెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లి పేరుతో హడావుడి చేసి కొన్నాళ్ల తర్వాత ముఖం చాటేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2025 వరకు తన కుమారుడి నుంచి దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయిలు అషురెడ్డి తీసుకుందని ధర్మేంద్ర తండ్రి కూడా చెబుతున్నారు. 35 కోట్ల విలువ చేసే నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్‌లు,కార్లు కొనుగోలు చేయించుకుందన్నారు. ఇక ధర్మేంద్ర ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసి మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫొటోలతో, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. కాగా తాజాగా వచ్చిన ఆరోపణల పై అషు రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.