AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy : జన నాయగన్ సినిమా లీక్ కేసులో ట్విస్ట్.. మరో ముగ్గురు అరెస్ట్..

సౌత్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా జన నాయగన్. తలపతి విజయ్ చివరి చిత్రం ఇది. ఇది భారీ స్థాయిలో విడుదల కావాల్సిన మూవీ. కానీ చాలా నెలలుగా సెన్సార్ వివాదం కారణంగా వాయిదా పడుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఇంటర్నెట్‌లో లీక్ అవ్వగా, పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ప్రధాన నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ే

Vijay Thalapathy : జన నాయగన్ సినిమా లీక్ కేసులో ట్విస్ట్.. మరో ముగ్గురు అరెస్ట్..
Jana Nayagan Movie
Rajitha Chanti
|

Updated on: Apr 16, 2026 | 6:04 PM

Share

జన నాయగన్ అనేది తలపతి విజయ్ నటించిన 69వ చిత్రం . ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం తెలుగులో విడుదలైన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్. ఇందులో తలపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, నరైన్ , ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత, సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.

తాజా సమాచారం ప్రకారం, ‘జన నాయకన్’ సినిమాను అక్రమంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేసిన మరికొందరిని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా మరో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు క్లౌడ్ స్టోరేజ్, సోషల్ మీడియా లింకుల ద్వారా సినిమాను వైరల్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సినిమా నిర్మాత KVN ప్రొడక్షన్స్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న సుమారు 300 కంటే ఎక్కువ పైరసీ లింకులను బ్లాక్ చేయించారు. టెలిగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఇతర వెబ్‌సైట్లలో ఈ సినిమా క్లిప్పింగ్‌లు షేర్ కాకుండా ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయి.

విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డుతో వివాదాల కారణంగా విడుదల ఆలస్యమవుతున్న తరుణంలో, సినిమా లీక్ కావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పైరసీని ప్రోత్సహించవద్దని, లీకైన లింకులను ఎవరూ షేర్ చేయకూడదని చిత్ర బృందం అభిమానులకు విజ్ఞప్తి చేసింది. చట్టవిరుద్ధంగా సినిమాను చూసే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Follow Us
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!