Dadasaheb Phalke-Rajinikanth:ఈ అవార్డుకు నూరు శాతం అర్హుడంటూ.. శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని మోడీ, చిరు, కమల్,

|

Apr 01, 2021 | 1:09 PM

Dada Saheb Award to Rajinikanth:సినీ వినీలాకాశంలో స్వయం కృషితో ఎదిగిన నటుడు రజనీకాంత్. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన రజనీకాంత్ బస్సు కండక్టర్ నుంచి..

Dadasaheb Phalke-Rajinikanth:ఈ అవార్డుకు నూరు శాతం అర్హుడంటూ.. శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని మోడీ, చిరు, కమల్,
Dada Saheb Award To Rajinik
Follow us on

Dada Saheb Award to Rajinikanth:సినీ వినీలాకాశంలో స్వయం కృషితో ఎదిగిన నటుడు రజనీకాంత్. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన రజనీకాంత్ బస్సు కండక్టర్ నుంచి నేడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే వరకూ ఎదిగిన ప్రస్తానం… అభినందనీయం.. నేటి యువతకు ఆదర్శం. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2020కి గాను ప్రకటించింది. రజనీని ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీలో మోహన్ లాల్, ఆశా భోస్లే, శంకర్ మహదేవన్, బిశ్వజీత్, సుభాశ్ ఘాయ్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో అరుదైన గౌరవం అందుకుంటున్న రజనీకాంత్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర హోమ్ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్ తదితరులు రజనీకాంత్ కు శుభాకాంక్షలను తెలిపారు.

తన స్నేహితుడు రజనీకి ఈ పురస్కారం రావడంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ స్పందించారు. తన ప్రియ మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు. ఈ పురస్కారం ఆయనకు దక్కడం సంతోషంగా ఉంది’ అని కమల్ ట్వీట్ చేశారు.

నా ప్రియమైన స్నేహితుడికి రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక # దాదాసాహెబ్ఫాల్కే అవార్డును ప్రకటించినప్పుడు సంతోషించానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. నిజంగా మీరు ఈ అవార్డు అందుకోవడానికి అర్హులు.. మీరు ఎంతగానో చిత్ర పరిశ్రమకి సేవలను అందించారు.. మీకు దేవుడి అండ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు చిరు.

Also Read:  అమ్మ ప్రేమకు మరో సాక్ష్యం.. తన పిల్లల క్షేమం కోసం తల్లి ఎలుగు తపన.. నెటిజన్లు ఫిదా..!
క్లాసికల్ హిట్ మూవీ మిస్సమ్మని మిస్సైన భానుమతి.. ఆ సీన్స్ ఫోటోలు మీకోసం.. !