Play Back Telugu Movie: దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో రాబోతున్న ‘ప్లేబ్యాక్’.. రిలీజ్ ఎప్పుడంటే..?

హరిప్రసాద్ జక్కా.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్.. సుకుమార్ వద్ద 100 లవ్, వన్ నేనొక్కడినే చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేశారు.

Play Back Telugu Movie: దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో రాబోతున్న ప్లేబ్యాక్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Updated on: Feb 19, 2021 | 7:34 PM

Play Back Telugu Movie: హరిప్రసాద్ జక్కా.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద 100% లవ్, వన్ నేనొక్కడినే చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు అంటే ఆయన విషయముంది అని అర్థమవుతుంది. కాగా ఈయన మెగాఫోన్ పట్టి ‘ప్లేబ్యాక్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

దినేష్ తేజ్, అనన్యా నాగళ్ల ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా  నటించారు. కాగా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తుండంతో మూవీ బజ్ పెరుగుతుంది. ఆయన ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట.  శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పథాకంపై తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ చిత్రంపై ఆసక్తి పెంచాయి. దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

Also Read:

Variety toddy: చిలుక తాగిన కల్లు.. భలే టేస్ట్ అంటున్న కల్లు ప్రియులు.. తెలంగాణలోని ఆ ప్రాంతానికి క్యూ

Telangana: మహిళా కూలీలతో కలిసి పాటలు పాడుతూ వరిపొలంలో నాట్లు వేస్తున్న ఈ ఎమ్మెల్యేను గుర్తుపట్టారా..?