Pawan Kalyan: ఆ విషయంలో ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి.. పవన్ కళ్యాణ్

కొన్ని సార్లు రావడం లేటవచ్చా.. కానీ రావడం పక్కా.. ఎవడైతే వందకు వందశాతం విజయం సాధిస్తుందో అదే జనసేన. వావ్..లాస్ట్ పంచ్ మనదే అయితే ఆకిక్కే వేరు కదా..ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు. అలాగని ఇదేమీ లాస్ట్ పంచ్ కాదు..ఇది జస్ట్ ట్రయిలే అన్నది జనసేన అధ్యక్షుడి మాట. నాడు ఓటమితో కుంగిపోలేదు..నేడు గెలుపుతో పొంగిలేదు..అంటున్న పవన్ కల్యాణ్ రాజకీయం రహదారి కాదు ముళ్లదారి.

Pawan Kalyan: ఆ విషయంలో ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి.. పవన్ కళ్యాణ్
Pawan Kalyan

Updated on: Jun 06, 2024 | 10:34 AM

రెండు చోట్ల ఓడిపోయిన రాజకీయనాయకుడు. పార్టీ పెట్టి అప్పటికే ఐదారేళ్లయింది..కేడర్‌ బలంగా లేదు. పార్టీకి పునాది అంతగా లేదు. ప్రత్యర్ధుల విమర్శలు..అయినా వెనకడుగు వేయలేదు. ఎంత కచ్చిగా తనపై విమర్శనాస్త్రాలు సంధించారో..అంత కసిగా రాజకీయంలో రాటుదేలారు. 2024లో పవన్ తీసుకున్న రాజకీయ వ్యూహాలు అనూహ్యం. తాను తగ్గినా పార్టీని గెలవాలన్న సంకల్పంతో పొత్తు అడుగులు వేశారు. ఆపొత్తుకోసం ఎన్నో కసరత్తులు చేశారు. కొన్ని సార్లు రావడం లేటవచ్చా.. కానీ రావడం పక్కా.. ఎవడైతే వందకు వందశాతం విజయం సాధిస్తుందో అదే జనసేన. వావ్..లాస్ట్ పంచ్ మనదే అయితే ఆకిక్కే వేరు కదా..ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు. అలాగని ఇదేమీ లాస్ట్ పంచ్ కాదు..ఇది జస్ట్ ట్రయిలే అన్నది జనసేన అధ్యక్షుడి మాట. నాడు ఓటమితో కుంగిపోలేదు..నేడు గెలుపుతో పొంగిలేదు..అంటున్న పవన్ కల్యాణ్ రాజకీయం రహదారి కాదు ముళ్లదారి.

పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి  సాధించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 21 నియోజకవర్గాలు కేటాయించారు. ఆ 21 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారు. దాంతో పవన్ రాజకీయంగా భారీ విజయం సాధించారు. పవన్‌కి ఇది అపూర్వ విజయం. పవన్ కళ్యాణ్, ఆయన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ చిరంజీవికి రాజకీయాల్లో పెద్దగా విజయం దక్కలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో ఒక్క జనసేన అభ్యర్థి కూడా గెలవలేదు. గెలిచిన ఒక్క అభ్యర్థి పార్టీ మారిపోయాడు. అటు స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ఆ రెండింటిలోనూ ఓడిపోయారు. కానీ ఈసారి 21 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయగా ఆ 21 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

ఇదిలా ఉంటే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులతో మాట్లాడారు. పవన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా చేయాలని నేను కలగన్నాను. మా నాన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేవాడు. దానికి మేము రుణపడి ఉన్నాం. అందుకే నేను కూడా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా జీతం మొత్తం తీసుకుంటాను అన్నారు పవన్ కళ్యాణ్. నేను ఎమ్మెల్యేగా జీతం తీసుంటాం కానీ తర్వాత నేను ఇవ్వాల్సింది ప్రజలకు ఇచ్చేస్తా.. ఎందుకు తీసుకుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని తింటున్నాను, ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోడానికి. నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని నిలదీయాలి అందుకే నేను జీతం తీసుకుంటాను అని పవన్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.