టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ తెరకెక్కించిన చిత్రం లైగర్. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించాడు. ఈ రోల్ కోసం రౌడీ దాదాపు రెండున్నరేళ్లు శిక్షణ తీసుకున్నారు. బాక్సర్‌గా తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఈ సినిమా కోసం విజయ్ తన శరీరాకృతితోపాటు.. నత్తితో మాట్లాడేందుకు ఎంతో కష్టపడినట్లు ఇటీవల లైగర్ ప్రమోషన్లలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలిపారు. తాజాగా విజయ్ జిమ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు కోచ్ జూనైద్ షేక్.
“ఎన్నో నిద్రలేని రాత్రులు, సుదీర్ఘ ప్రయాణాలు, అనేక ప్రార్థనలు. నెల రోజుల ప్రమోషన్ల తర్వాత మరింత కష్టపడడం. మిమ్మల్ని చేరడం కోసం మరింత హడావిడి చేయడం.. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండడం.. తనను మెరుగుపరుచుకుంటున్నాడు. అతను చేయలేని పని ఏమి లేదు. విజయం అనేది అతని పేరులోనే ఉంది”. అంటూ విజయ్ జిమ్ వీడియో షేర్ చేశాడు. లైగర్ ప్రమోషన్స్, రిలీజ్ తర్వాత విజయ్ జనగణమన సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం విజయ్ తిరిగి జిమ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. లైగర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. లైగర్ చిత్రం తర్వాత విజయ్, పూరి కాంబోలో జనగణమన చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.