ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలు చేస్తూ బిజీగా బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు శరవేగంగా సలార్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసేపనిలో ఉన్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ప్రభాస్. ‘కల్కి 2898 AD’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా అవతారాల్లో కనిపిస్తాడని అంటున్నారు. ఆయన లుక్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో చిత్రయూనిట్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టీమ్‌లో ఉండి ఇలా చేయడం చిత్రయూనిట్ ను బాధ కలిగిస్తుంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని టీమ్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అయితే కొందరు చేసే తప్పుల వల్ల నిర్మాతలు నష్టపోవాల్సి వస్తోంది.
లీకుల బెడద కొత్తేమీ కాదు కొంతమంది సినిమా సెట్‌ల ఫోటోలను, వీడియోలను లీక్ చేస్తారు. ఇది నిన్నటి-నేటి సమస్య కాదు. మొబైల్ వినియోగం పెరిగినప్పటి నుంచి ఈ సమస్య ఎదురవుతూనే ఉంది. ఇలా ఫోటోలు, వీడియోలు లీక్ అయితే సినిమాపై జనాల్లో అంచనాలు తగ్గుతాయి. ఇలా జరగకుండా ఉండేందుకు చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ లీకులు మాత్రం ఆగడంలేదు. ఇప్పుడు ప్రభాస్ నటించిన ‘ కల్కి 2898 AD’ కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు చిత్రయూనిట్.
తాజాగా రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సెట్స్ నుంచి వీడియో, ఫోటోలు లీక్ అయ్యాయి. రామ్ చరణ్ లుక్ రివీల్ అయింది. దీనిపై గతంలో ఫిర్యాదు చేశారు చిత్రనిర్మాతలు. ఇప్పుడు కల్కి టీమ్ కూడా అదే బాటలో నడుస్తోంది. సెట్‌లో ప్రభాస్ నిలబడి ఉన్న ఫోటోలను క్యాప్చర్ చేసి లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే లీకుల పై తెలుగు సినీ పరిశ్రమ సీరియస్‌గా ఉంది. ఇలా లీక్ చేసిన వారిపై ఇప్పటికే పలు చిత్ర బృందాలు చర్యలు కూడా తీసుకున్నాయి. ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. మొన్నామధ్య విదులైన గ్లింప్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.