Naatu Naatu song : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న నాటు నాటు సాంగ్.. దేశమంతా డాన్స్ చేస్తుంది

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను దాటి సక్సెస్ ను సాధించింది.

Naatu Naatu song : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న నాటు నాటు సాంగ్.. దేశమంతా డాన్స్ చేస్తుంది
Rrr

Updated on: Mar 13, 2023 | 8:38 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశం మొత్తం రాజమౌళిని ఆకాశానికెత్తేస్తోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను దాటి సక్సెస్ ను సాధించింది. ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేశారు జక్కన. ఇక ఈ సినిమాలో నాటు నాటు పాట.. గోల్డెన్ గ్లోబల్ అవార్డుతో పాటు ఎంతో ప్రతిశాత్మక మైన ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో నాటు నాటు అనే పాటను చంద్రబోస్ రచించారు. అలాగే ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. చరణ్, తారక్ ఈ పాటలో అద్భుతంగా డాన్స్ చేసి అలరించారు.

నాటు నాటు సాంగ్ ను ఉక్రెయిన్ లో షూట్ చేశారు. దాదాపు 17 రోజుల పాటు ఈ పాటకు రిహార్సిల్స్ చేశారు చరణ్, తారక్. అలాగే ఐదురోజులు ఈ పాటను చిత్రీకరించారు జక్కన్న. దాదాపు 500 మందితో ఈ పాటను షూట్ చేశారు రాజమౌళి. ఈ పాటలోని చరణ్, తారక్ కలిసి చేసిన హుక్ స్టెప్ బాగా పాపులర్  అయిన విషయం తెలిసిందే.

ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో చాలా మంది ఈ సినిమాలోని హుక్ స్టెప్ ను చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ ఆ పాటకు డాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తున్నారు. దేశం, బాషాతో సంబంధం లేకుండా అందరు నాటు నాటు పాటకు డాన్స్ లు వేస్తున్నారు.