AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi Babu: ‘నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ’.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

పెద్ది సినిమాలో రామ్ చరణ్ తర్వాత బాగా హైలెట్ అయ్యింది జగపతి బాబు. అప్పల సూరి పాత్రలో జగ్గూ భాయ్ నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇలా తన అభినయంతో అందరి ప్రశంసలు అందుకుంటోన్న జగపతి బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Jagapathi Babu: 'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
Actor Jagapathi Babu
Basha Shek
|

Updated on: Jun 09, 2026 | 3:25 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చి బాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఐదురోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిన పెద్ది సినిమా ఓవరాల్ గా ఇప్పటివరకు రూ. 315 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన పెద్ది సినిమా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. అతని తర్వాత ఈ మూవీలో బాగా హైలెట్ అయ్యింది జగ్గూ భాయ్. అప్పల సూరి పాత్రలో ఆయన నటన ఆడియెన్స్ తో కన్నీరు పెట్టించింది. కాగా పెద్ది ప్రమోషన్లలో జగ్గూ భాయ్ కూడా పాల్గొంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. విషయమేదైనా ముక్కుసూటిగా మాట్లాడే జగపతి బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

‘నేను సిల్వర్ స్క్రీన్‌పై నటిస్తున్నాను. బయట నటిస్తూ బతకాల్సిన అవసరం నాకు లేదు. నిజానికి ‘జీవితంలో నేను అబద్ధం చెప్పలేదు’ అని ఎవరైనా చెబితే.. అదే పెద్ద అబద్ధం అవుతుంది. కానీ నిజం చెప్పి కూడా బతకొచ్చు అని నాకు బాగా అర్థమైంది. అందుకే నిజాలు దాచి పెట్టడం, ప్రతి దానికి అబద్దాలు ఆడాల్సిన అవసరమేముంది? అని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచే ఇలా ముక్కు సూటిగా, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను’. కాగా బతికి ఉండగానే తాను చనిపోయినట్లు వార్తలు రావడంపై జగ్గూ భాయ్ స్పందిస్తూ.. ‘సోషల్ మీడియాలో నేను చనిపోయానంటూ తప్పుడు వార్తలు ప్రచారమైన సందర్భాలు కూడా ఉన్నాయి. నా డెడ్ బాడీ పక్కన ఎన్టీఆర్ తో పాటు ఇతర హీరోలు ఏడుస్తున్నట్లుగా ఉన్న ఎడిట్ చేసిన దృశ్యాలను కూడా నెట్టింట వైరల్ చేశారు. కానీ అలాంటి వాటి గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కొందరు నన్ను చంపేసినా.. నేను మాత్రం నిజాయతీతో జీవిస్తున్నాను’ అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగ్గూభాయ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

 5 రోజుల్లో 315 కోట్లు కలెక్షన్లు సాధించిన పెద్ది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు
సరికొత్త మైలురాయి.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ..!
సరికొత్త మైలురాయి.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ..!