
పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆర్‌ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్ పుత్ బోల్డ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది పాయల్. గ్లామర్ రోల్ లో పాయల్ నటన అందరిని ఆకట్టుకుంది . ,ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్. ఆర్ ఎక్స్ 100 సినిమాతర్వాత పాయల్ కు బిగ్ ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ రవితేజ నటించిన డిస్కో రాజా, వెంకటేష్ నటించిన వెంకీ మామ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచింది. ఆతర్వాత అనగనగ ఓ అతిథి అనే సినిమా లో నటించింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాకు కొంచం పాయిజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు తనకు ఆర్ ఎక్స్ 100 లాంటి భారీ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి తో కలిసి మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే పాయల్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా పాయల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు థాంక్స్ చెప్పింది.
మంగళవారం సినిమా సూపర్ హిట్ కడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మంగళవారం సినిమా పై సినీ సెలబ్రెటీలు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మంగళవారం సినిమా పై తన అభిప్రాయాన్ని తెలిపారు. చిత్రయూనిట్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు చరణ్. ఈ పోస్ట్ కు రిప్లే ఇస్తూ పాయల్ మేడ్ మై డే, థాంక్స్ ఏ లాట్ అంటూ రెస్పాండ్ అయ్యింది పాయల్. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
You just made my day 🦋 Thanks a lot sir 🙏🏼 https://t.co/veVTCBRfQi
— paayal rajput (@starlingpayal) November 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.