Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. క్రిష్‍ను పక్కనపెట్టేశారా..?

|

May 02, 2024 | 11:48 AM

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం పవన్, హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత పవన్ పొలిటికల్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తుంది. కానీ మూడేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా.. భారీ బడ్జెట్, ఎక్కువగా షూటింగ్ డేట్స్ ఉన్న కారణంగా ఈ సినిమా ఆలస్యమయ్యింది. అలాగే మరో రెండు మూడు చిత్రాల్లో పవన్ నటిస్తుండడంతో డేట్స్ అడస్ట్ కాకపోవడంతో ఈ మూవీ షూటింగ్ మరింత ఆలస్యమయ్యింది.

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు సినిమాకు కొత్త డైరెక్టర్.. క్రిష్‍ను పక్కనపెట్టేశారా..?
Hari Hara Veeramallu Movie
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు. చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా.. అనేక కారణాలతో ఈ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం పవన్, హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత పవన్ పొలిటికల్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తుంది. కానీ మూడేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా.. భారీ బడ్జెట్, ఎక్కువగా షూటింగ్ డేట్స్ ఉన్న కారణంగా ఈ సినిమా ఆలస్యమయ్యింది. అలాగే మరో రెండు మూడు చిత్రాల్లో పవన్ నటిస్తుండడంతో డేట్స్ అడస్ట్ కాకపోవడంతో ఈ మూవీ షూటింగ్ మరింత ఆలస్యమయ్యింది.

అయితే కొన్నాళ్లుగా ఈ సినిమా గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందంటూ టాక్ నడిచింది. ఈ అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్స్ మీద డైరెక్టర్ క్రిష్ పేరు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి చిత్రయూనిట్ అతడిని తప్పించిందని వార్తలు వినిపించాయి. అలాగే కొన్నిరోజులుగా అతడిపై డ్రగ్స్ కేసు ఆరోపణలు రావడంతో అప్పట్నుంచి క్రిష్ ఈ ప్రాజెక్ట్ కు దూరంగా ఉంటున్నట్లు టాక్ వినిపించింది.

తాజాగా ఈరోజు విడుదలైన టీజర్ లో డైరెక్టర్ క్రిష్ పేరుతోపాటు.. మరొ కొత్త డైరెక్టర్ జ్యోతి కృష్ణ పేరు కూడా కనిపించింది. మిగిలిన చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అతడు నిర్మాత ఏఎం రత్నం తనయుడు. 7/G బృందావన కాలనీ సినిమా హీరో రవికృష్ణకు అన్నయ్య.. తెలుగు, తమిళంలో పలు చిత్రాలను తెరకెక్కించాడు. ఎనక్కు 20 ఉనక్కు 18, నీ మనసు నాకు తెలులు, ఆక్సిజన్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. దర్శకుడిగానే కాకుండా రచయితగానూ పేరు తెచ్చుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.