Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. ‘గుడుంబా శంకర్’ రీరిలీజ్.. ఎప్పుడంటే..

|

Mar 28, 2023 | 8:52 AM

ఇప్పటికే పవన్ నటించిన ఖుషి, జల్సా చిత్రాలు రీరిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా కూడా తిరిగి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. అదే గుడుంబా శంకర్.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. గుడుంబా శంకర్ రీరిలీజ్.. ఎప్పుడంటే..
Pawan Kalyan
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా స్టార్ హీరోస్ చిత్రాలు మరోసారి థియేటర్లలో సందడి చేస్తుండగా.. ప్రేక్షకులు సైతం త్రోబ్యాక్ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక నిన్న మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఆరెంజ్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మరో మాస్ సూపర్ హిట్ రీరిలీజ్ కు సిద్ధమయ్యింది. ఇప్పటికే పవన్ నటించిన ఖుషి, జల్సా చిత్రాలు రీరిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా కూడా తిరిగి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. అదే గుడుంబా శంకర్.

ఈ సినిమాను మరోసారి రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే దీనిపై ఆధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తర్వలోనే ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను అనౌన్స్ చేయబోతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మించి ఈ చిత్రానికి వీరశంకర్ దర్శకత్వం వహించారు. ఇందులో పవన్ సరసన మీరాజాస్మిన్ కథానాయికగా నటించగా.. ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే ప్రతినాయకులుగా కనిపించారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఇటు సినిమాలను.. అటు రాజకీయాలను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అలాగే డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తోకలిసి ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు పవన్.