
పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచే మొదటి పోస్ట్ ఏం పెడతారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తానికి ఆయన పోస్ట్ చేసారు.. చాలా రోజులుగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌లో ఉన్న అనుమానాలకు ఈ ఒక్క పోస్టుతోనే చెక్ పెట్టారు పవన్. ఇండస్ట్రీతో తన రిలేషన్‌ను చెప్తూనే.. ఫ్యూచర్‌లో సినిమాలు చేస్తారా చేయరా అనే దానికి సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు హీరో అనే స్టేజ్ దాటి.. ఎమోషన్ వరకు వెళ్లిపోయారు. పొలిటికల్‌గా ఆయన జర్నీ ఎలా ఉన్నా సినిమాల వరకు మాత్రం తిరుగులేని సూపర్ స్టార్. పొలిటికల్ బిజీలో పడి సినిమాలు చేస్తాడా చేయరా అనే అనుమానం అభిమానుల్లో చాలా రోజులుగా పవన్ ఫ్యాన్స్ మదిలో అలాగే ఉండిపోయింది. వీటన్నింటికీ ఒక్క పోస్ట్‌తో సమాధానమిచ్చారు జనసేనాని.
చూస్తున్నారుగా.. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత చేసిన మొదటి పోస్ట్ ఇదే. ఏదో పొలిటికల్ పెడతారు అనుకుంటే.. పక్కా సినిమా పోస్ట్ పెట్టి అందరికీ షాకిచ్చారు పవర్ స్టార్. అంతేకాదు.. ఎప్పుడూ మీతో బంధం ఇలాగే ఉండాలని.. ఉంటుందని చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా.. సినిమాలను వదిలేది లేదని తేల్చేసారు పవన్.
పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా పూర్తిగా రాజకీయాలతోనే బిజీ అయిపోయారు. దాంతో పాటే వరస సినిమాలకు కమిటయ్యారు. కానీ వాటికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతానికి బ్రో సినిమాను పూర్తి చేసిన పవన్.. ఓజిని కూడా ఆగస్ట్‌లోపు పూర్తి చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు ఉస్తాద్, హరిహర వీరమల్లు సినిమాలకు కూడా కమిటయ్యారు పవన్. ఎన్నికల తర్వాతే వీటికి మోక్షం వచ్చేలా కనిపిస్తుంది. 2024 ఎన్నికల తర్వాత పవన్ ప్లానింగ్ ఎలా ఉంటుంది.. సినిమాలు చేస్తారా లేదా అనే డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఎందుకంటే తనకు సినిమాలపై ఆసక్తి లేదు.. కేవలం పార్టీని నడపటానికే డబ్బు కోసం చేస్తున్నానంటూ చెప్తుంటారు పవన్. అయితే తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌తో ఇండస్ట్రీతో తనకెప్పుడూ బంధం తెగిపోదని.. దూరం కానని భరోసా ఇచ్చారు పవర్ స్టార్. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాజకీయంగా ఎలా ఉన్నా.. సినిమాలైతే వదిలేయనంటూ మాటిచ్చారు.