Pawan kalyan: సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ మూవీ విడుదలయ్యాకే…

తన చేస్తున్న సినిమా నిర్మాతలతో ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్‌ సమావేశమయ్యారు. సినిమాల్లో ఆయన నటించాల్సిన పాత్రలు మాత్రమే పెండింగ్‌ ఉండడంతో..త్వరలోనే షూటింగ్‌ పూర్తి చేసి.. సినిమాలు విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని నిర్మాతలకు పవన్ చెప్పినట్టు తెలుస్తోంది.

Pawan kalyan: సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ మూవీ విడుదలయ్యాకే...
Pawan Kalyan

Updated on: Apr 23, 2025 | 5:48 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న సినిమాలన్ని వాయిదాల మీద వాయుదాల పడుతున్నాయి. సినిమాల్లో పవన్ కల్యాణ్ నటించాల్సిన పాత్రలు మాత్రమే బ్యాలన్స్‌ ఉండడంతో ఆయన డేట్స్‌ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఆయన ఎప్పుడు ఫ్రీ అవుతారో.. ఎప్పుడు వచ్చి షూటింగ్‌ పూర్తి చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తాను చేయబోయే సినిమా నిర్మాతలు ఏఎం రత్నం, మైత్రీ మూవీ మేకర్స్‌, డీవీవీ దానయ్యతో పవన్ కల్యాణ్‌ సమావేశం అయ్యారు. వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్‌ పూర్తి చేస్తానని నిర్మాతలకు పవన్ కల్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే పవన్ కల్యాణ్ మొదటగా హరిహర వీరమల్లు షూటింగ్‌ పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసే వచ్చే నెలలో రిలీజ్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా కరోనా ముందు మొదలు కాగా ఇప్పటి వరకు చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఈ సినిమాను పూర్తి చేసి మిగతా సినిమాల షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా పవన్‌ ఇంకా రెండు సినిమాల షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో వస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో పాటు, ఓజీ సినిమా షూటింగ్‌ కూడా పవన్ పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి వారికి కూడా జులై నుంచి డేట్స్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా తర్వాత ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…