Pawan Kalyan: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్.. ముగ్గురి కటౌట్‌ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

దేశానికి రాజైనా తల్లికి కొడుకే అనంటారు...! ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ విషయంలోనూ అదే డైలాగ్‌ వినిపిస్తోంది...! రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినా... తాను తండ్రినే అంటున్నారు పవన్‌. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో యమా బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి టైమ్‌ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్‌ అనిపించుకుంటున్నారు.

Updated on: Jul 05, 2025 | 11:49 AM

మొన్నటిదాకా సినిమాల్లో పవర్‌ స్టార్… ఇప్పుడు పొలిటికల్‌గానూ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న పవన్‌ కళ్యాణ్… ఫ్యామిలీ స్టార్‌ని కూడా అనంటున్నారు. ఓవైపు షూటింగులు, సినిమా రిలీజులతో బిజీ… మరోవైపు రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలంటూ యమా బిజీ. ఇలా బిజీబిజీ టైమ్‌లోనూ ఫ్యామిలీకి టైమ్‌ కేటాయిస్తున్నారాయన. శుక్రవారం ఒంగోలులో ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పటికీ… అంతకుముందు ఇద్దరు కుమారులు అకీరా నందన్, మార్క్‌ శంకర్‌తో కలిసి మంగళగిరిలో ల్యాండయ్యారు. చిన్నోడి చెయ్యి పట్టుకుని, పెద్దోడిని పక్కనపెట్టుకుని ఫ్లైట్‌లో దిగి పార్టీ ఆఫీస్‌లోకి వెళ్లారు.

ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రి కటౌట్‌ చేసి ఫ్యాన్‌ దిల్‌ ఖుష్‌ అవుతోంది…! మా పవర్‌ స్టార్‌… పక్కా ఫ్యామిలీ మ్యాన్‌ అంటున్నారు. ముగ్గురిని చూడ్డానికి రెండు కళ్లు సరిపోవట్లేదంటూ సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్‌ చేస్తున్నారు. ఇక ఈ ఒక్క ఇన్సిడెంట్‌ మాత్రమే కాదు… గతంలోనూ పెద్ద కొడుకు అకీరా నందన్‌ను వెంటేసుకుని టూర్లు గట్టిగానే వేశారు పవన్‌ కళ్యాణ్‌. దక్షణాదిలోని ఆలయాల పర్యటనకు అకీరాను తీసుకెళ్లారు. తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాల్లో అకీరాతో కలిసి పూజలు చేశారు. కొడుకులే కాదు అంతకుముందు కూతుళ్లతోనూ కనిపించారు పవన్‌. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ అంటూ తిరుమల వెళ్ళినప్పుడు కుమార్తెలు ఆద్య, పొలెనాతో కనిపించారు. ఇక అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీ నుంచి తిరిగివస్తూ భార్య అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా, కూతురు ఆధ్యతో పవన్‌ కలిసి దిగిన ఫోటో అప్పట్లో వైరల్‌ అయ్యింది.