Pawan Kalyan: ‘ప్రభాస్‌, మహేశ్‌ నాకంటే పెద్ద హీరోలు.. ఆ విషయంలో నాకు ఈగో లేదు’

|

Jun 22, 2023 | 8:03 AM

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ప్రభాస్‌, మహేశ్‌బాబులు తనకంటే పెద్ద హీరోలని, తన కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వారాహి విజయయాత్రలో..

Pawan Kalyan: ప్రభాస్‌, మహేశ్‌ నాకంటే పెద్ద హీరోలు.. ఆ విషయంలో నాకు ఈగో లేదు
Pawan Kalyan
Follow us on

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ప్రభాస్‌, మహేశ్‌బాబులు తనకంటే పెద్ద హీరోలని, తన కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వారాహి విజయయాత్రలో భాగంగా బుధవారం (జూన్‌ 21) కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తన పొలిటికల్‌ స్పీచ్‌తోపాటు టాలీవుడ్‌ హీరోల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముమ్మడివరం సభలో పవన్‌ మాట్లాడుతూ..

‘మీ అభిమానులు, ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడూ గొడవపడుతుంటారని కొందరు నాతో చెబుతుంటారు. సినిమా అనేది వినోదం, ఆనందం. నాకు జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా ప్రతి ఒక్కరిపై నాకు గౌరవం ఉంది. నేను వారందరి సినిమాలు చూస్తా. మేము ఎదురుపడిడే మాట్లాడుకుంటాం. సినిమాల పరంగా హీరోల మీద ఇష్టాన్ని రాజకీయాల్లో చూపించకండి. సినిమాలు వేరు రాజకీయాలు వేరు. సినిమాలపరంగా మీరు ఏ హీరోని అయినా ఇష్టపడండి. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం నా మాట వినండి’ అన్నారు.

ఇంకా ఈ విధంగా మాట్లాడారు..’ప్రభాస్, మహేష్ నా కంటే పెద్ద హీరోలు. వీరు పాన్‌ ఇండియా హీరోలు. నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. చరణ్‌, ఎన్టీఆర్‌ అయితే గ్లోబల్‌ స్థాయికి ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్లు తెలిసినంతగా నేను తెలియదు. ఆ విషయంలో నాకు ఎలాంటి ఈగో లేదు. నేను సగటు మనిషి బాగుంటే చాలనుకుంటా. కులంపరంగా మనలో మనం గొడవ పడొద్దు. సినిమాల విషయంలో ఎవరినైనా అభిమానించండిగానీ రాజకీయల విషయంలో మాత్రం సమష్టిగా ఆలోచిద్దాం. పోరాటం చేసేవాళ్లు ఈ సమాజానికి కావాలి. నేను ఒక్కడి సరిపోను. అన్యాయాన్ని ప్రశ్నించే నాయకులు కావాలంటూ’ వ్యాఖ్యానించారు. తెలుగునాట ఓ పెద్ద హీరో అయ్యి ఉండి ఇతర హీరోల గురించి పవన్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.