Pawan Kalyan: గొప్పమనసు చాటుకున్న పవన్.. నిర్మాతకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వనున్న పవర్ స్టార్ !

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ . క్రిష్ జాగర్ల మూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ హిస్టారికల్ మూవీలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా యాక్ట్ చేసింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pawan Kalyan: గొప్పమనసు చాటుకున్న పవన్.. నిర్మాతకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వనున్న పవర్ స్టార్ !
Pawan Kalyan

Updated on: Jun 04, 2025 | 2:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేప్పట్టిన తర్వాత చాలా బిజీ అయ్యేరు. కాగా ఎన్నికల ముందు ఆయన కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లోనూ వీలు దొరికినప్పుడల్లా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో హరిహరవీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. వీరితో పాటు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ కేర్, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు జూన్ 12న హరిహరవీరమల్లు సినిమా పేక్షకుల ముందుకురానుంది.

హరిహరవీరమల్లు సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించారు. ఆతర్వాత దర్శకుడు మారాడు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. హరిహరవీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకొని పవన్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారని తెలుస్తుంది.

హరిహరవీరమల్లు సినిమా కోసం పవన్ రూ. 11కోట్లవరకు అడ్వాన్స్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని మొత్తం రూ. 11కోట్లు తిరిగి ఇవ్వనున్నారని తెలుస్తుంది. అంతే కాదు.. సినిమా పై  ఎక్కువ ఒత్తిడి లేకుండా రిలీజ్ చేయమని రత్నంకు చెప్పారట పవన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ పై అభిమానులు, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ ఓజీ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.