Pawan Kalyan: అరుదుగా సాయం అడుగుతుంటా.. ఆ యంగ్ హీరోకు పవన్ కల్యాణ్ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా హరి హర వీరమల్లు. గురువారం (జూలై 03) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఒక యంగ్ హీరోకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు పవన్.

Pawan Kalyan: అరుదుగా సాయం అడుగుతుంటా.. ఆ యంగ్ హీరోకు పవన్ కల్యాణ్ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే?
Pawan Kalyan

Updated on: Jul 03, 2025 | 9:51 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న మొదటి పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని డైరెక్టర్‌ క్రిష్ జాగర్లమూడి ప్రారంభించగా, ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. అలాగే యానిమల్ ఫేమ్ బాబీ డియోల్, అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం పవన్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి మెగాభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం వీరమల్లు ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. సోషల్ మీడియానూ షేక్ చేస్తోంది. అయితే ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఓ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. ‘నేను అరుదుగా సాయం అడుగుతుంటా. నేను అడిగింది నువ్వు చేశావ్‌. డియర్‌ బ్రదర్‌.. నీకు నేను కృతజ్ఞుడిని. నీ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంది’ అని ట్వీట్ చేశారు పవన్. సాధారణంగా ఎవరైనా అడిగితే వెంటనే సాయం చేస్తారు పవన్. అలాంటి పవన్ కు సాయం చేసిన ఆ యంగ్ హీరో మరెవరో కాదు అర్జున్ దాస్.

హరి హర వీరమల్లు’ ట్రైలర్‌కు యాక్టర్‌ అర్జున్‌ దాస్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఇది ట్రైలర్ కు మరింత హైలెట్ గా నిలిచారు. ఈ క్రమంలోనే వీర మల్లు ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా అర్జున్‌ గురువారం ఉదయం పోస్టు పెట్టారు. ‘పవన్ కళ్యాణ్ అడిగితే కాదంటామా.. ఎలాంటి ఎదురు ప్రశ్నలు లేకుండా హ్యాపీగా ట్రైలర్‌కు వాయిస్ ఇచ్చాను’అని ట్వీట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన పవన్ అర్జున్ దాస్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ ట్వీట్..

పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న మరో సినిమా ‘ఓజీ’లో అర్జున్‌ దాస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో రిలీజైన గ్లింప్స్ కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..