Pawan Kalyan: పవన్ చిన్న కొడుకు హెల్త్ బులెటిన్ విడుదల.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై డాక్టర్స్ ఏమన్నారంటే..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు కావడం.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో.. ప్రస్తుతం మార్క్ శంకర్ కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు.

Pawan Kalyan: పవన్ చిన్న కొడుకు హెల్త్ బులెటిన్ విడుదల.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై డాక్టర్స్ ఏమన్నారంటే..
Pawan Kalyan

Updated on: Apr 09, 2025 | 12:20 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్‏లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీంతో ప్రస్తుతం అతడికి సింగపూర్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తోపాటు మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ టీమ్ అప్డేట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడని.. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

“మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన శ్రీ పవన్ కల్యాణ్ గారు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు” అంటూ జనసేన పార్టీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని.. దైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

 

Loading...
Unable to load recommendations.
Follow Us