
Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓ వైబ్రేషన్. ప్రాణాలైన ఇచ్చే అభిమానగణం. పలికే ప్రతి మాట ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. పవన్ సినిమా వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సామాన్యులు మాత్రమే కాదు.. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పవన్ అభిమానులున్నారు. కేవలం నటన, హీరోయిజం మాత్రమే కాదు.. తన ప్రతి ఆలోచన ప్రజల మంచి కోసం తాపత్రాయపడే జనసైనికుడు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రతి అభిమానికి నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాందించుకుని.. ఇండస్ట్రీలోనే తనే ఓ బ్రాండ్‌గా మారిన పవన్ పుట్టిన రోజు నేడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. భారీ కటౌట్స్, పాలాభిషేకాలు అంటూ సందడి చేస్తున్నారు. గతంలో తన జీవితం.. కుటుంబం.. కెరీర్ గురించి పవన్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో పవన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. కానీ ఇంట్లోవాళ్లు చూడడంతో బతికి బయటపడినట్లు చెప్పుకొచ్చారు.
“చిన్నతనంలో తనకు ఎప్పుడు అనారోగ్యాంగానే ఉండేది.. ఇంట్లో ఎక్కువగా అల్లరి చేసేవాడిని కాదు.. స్నేహితులు కూడా తక్కువ. ఫ్రెండ్స్ అభిప్రాయాలు..నా ఆలోచనలకు అస్సలు పొంతన ఉండేది కాదు. ఎనిమిదవ తరగతి నుంచి పరీక్షలలో ఫెయిల్ కావడం వల్ల ఇంటర్ పరీక్షలు తప్పినా అంతగా నిరుత్సాహపడలేదు. దీంతో సెప్టెంబరులో ప్రయత్నించాను. అప్పుడు కూడా పాస్ కావడం అసాధ్యమని అర్థమయ్యింది. ఫ్రెండ్స్ అంతా జీవితంలో ముందుకు వెళ్తున్నారు. మనం ఉన్న చోటే ఉన్నాం. ఫెయిల్ అవుతున్నా ఇంట్లో వాళ్లు ఏం అనలేదు. దీంతో తెలియని అపరాధభావన మనసులో ఉండిపోయింది. తెలియని నిస్పృహ వెంటాడేది. ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యి.. ఆత్మహత్యకు ప్రయత్నించాను. కుటుంబసభ్యులు చూడడంతో బతికిపోయాను. ఇద్దరు అన్నయ్యలు, సురేఖ వదిన అండగా నిలిచి.. చదవకపోయిన మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం.. ముందు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో అని సలహా ఇచ్చారు” అని గతంలో చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి