జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు నేడు. అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. దీంతో ఫ్యాన్స్..పవన్‌కు విభిన్న పద్దతుల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ క్రమంలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ బాధ్యుడు చైతన్య పవన్ సైకత శిల్పాన్ని రూపొందించారు. వంశధార నది, సాగరతీరం కలయిక ప్రాంతమైన కళింగపట్నం సముద్ర తీరంలో ఇసుకతో పవన్ రూపాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇక పవన్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ‘ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరోవైపు, పవన్ కొత్త సినిమాలకు సంబంధించి బుధవారం వరుస అప్‌డేట్‌లు రానున్నాయి.
Also Read :