Pawan Kalyan: ఉత్తర అమెరికాను ఊపేస్తున్న OG ఫీవర్.. విడుదలకు ముందే రికార్డ్ వేట మొదలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెయిటెడ్ సినిమా 'ఓజీ. (దే కాల్ హిమ్ ఓజీ) రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరోవైపు విడుదలకు ముందే రికార్డ్స్ వేటని మొదలు పెట్టింది. ఓజీ ఇప్పటికే విదేశాల్లో సంచలనాలు సృష్టిస్తోంది, థియేటర్లలో విడుదలకు ముందే ఉత్తర అమెరికాలో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఓజీ ప్రీమియర్ ప్రీ-సేల్స్ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

Pawan Kalyan: ఉత్తర అమెరికాను ఊపేస్తున్న OG ఫీవర్.. విడుదలకు ముందే రికార్డ్ వేట మొదలు
Og Mania Grips North America

Updated on: Sep 11, 2025 | 12:49 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా కోసం అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచంలోని పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కు ముందే సందడి చేస్తున్నారు. OG ఫీవర్ ఉత్తర అమెరికాను తాకింది.. విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టిక్కెట్ల అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ప్రీమియర్‌కు ఇంకా సమయం ఉంది. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్యాన్స్ ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటోంది.

యాక్షన్-ప్యాక్డ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కిన OG విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తెలుగులో ఓమి భావు అనే విలన్‌గా అరంగేట్రం చేస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ , శ్రీయా రెడ్డి , హరీష్ ఉత్తమన్ ఇతర ప్రధాన తారాగణం. తమన్ సంగీతం అందించాడు.

ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 45,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక అద్భుతమైన ఘనత. ఉత్తర అమెరికాలోనే ఈ ప్రీమియర్ ప్రీ సెల్ ద్వారా $1 మిలియన్ గ్రాస్ మార్కును దాటింది. ఇది కళ్యాణ్ స్టార్ పవర్‌ను రుజువు చేస్తుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..