Hari Hara Veera Mallu: తిరుపతి కాదు.. హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఇక్కడే! చీఫ్ గెస్టులు ఎవరంటే?

సుమారు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆయన వీలు కల్పించుకుని మరీ ఈ సినిమాను పూర్తి చేశారు.

Hari Hara Veera Mallu: తిరుపతి కాదు.. హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది ఇక్కడే! చీఫ్ గెస్టులు ఎవరంటే?
Hari Hara Veeramallu

Updated on: Jul 14, 2025 | 6:22 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. బాబీ డియోలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అలాగే నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ తదితర స్టార్స్ ఈ హిస్టారికల్ మూవీలో సందడి చేయనున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన వీరమల్లు సినిమా ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ , ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తోన్న మొదటి సినిమా కావడంతో వీరమల్లు పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా రెండు సార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించవచ్చునని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 20న విశాఖ పట్నంలో భారీ ఈవెంట్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అలాగే స్టార్ డైరెక్టర్లు ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వీర మల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్నారని సమాచారం. కాగా ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోనూ వీర మల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు  వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.   17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో హరి హర వీరమల్లు సినిమా తెరకెక్కింది. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకు అందించారు. దయాకర్ రావు, ఎఎం రత్నం నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సెన్సార్ పూర్తి చేసుకున్న హరి హర వీరమల్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..